CM Jagan Review: ‘ఫస్ట్ ఫైన్ వేయండి.. వినకుంటే క్రిమినల్ కేసులు’… కరోనాపై రివ్యూలో సీఎం జగన్ కీలక ఆదేశాలు
కరోనాపై పోరాటంలో భాగమైన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడుతోందని....
కరోనాపై పోరాటంలో భాగమైన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడుతోందని సీఎం చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు కరోనా కట్టడిపై మరింత ఫోకస్ పెంచాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలన్నారు. రూల్స్ ఉల్లంఘించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తరచుగా తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా… మళ్లీ చేస్తే కేసులు పెట్టాలని తేల్చి చెప్పారు. 104కు ఎవరైనా ఫోన్ చేస్తే సరైన సమాధానం ఇవ్వాలని… సరిగ్గా స్పందించకుంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలని… 45 ఏళ్లు పైబడిన వారికి పూర్తయ్యాక మిగిలిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఆదేశించారు. మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ కోసం వేచిచూస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లపై నియంత్రణతో కొరత లేకుండా ఇవ్వగలుగుతున్నామని సీఎం జగన్ చెప్పారు.
మరోవైపు ఏపీలో కఠినంగా లాక్ డౌన్ అమలువుతంది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. జూన్ ఫస్ట్ నుంచి లాక్ డౌన్ కొనసాగింపు లేదా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభించాలా అనే అంశంపై మరోసారి సీఎం జగన్ అధికారులు, మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: ఆర్మీ ఆసుపత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్.. నేరుగా ఢిల్లీకి పయనం..