AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కెప్టెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని మోదీ ఫొటో తొలగింపు..

Covid-19 vaccine certificates: కోవిడ్ వ్యాక్సినేషన్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మినహా.. అన్ని ప్రభుత్వాలు నరేంద్రమోదీ ఉన్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌నే

Covid-19: కెప్టెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని మోదీ ఫొటో తొలగింపు..
Covid-19 vaccine certificate
Shaik Madar Saheb
|

Updated on: May 26, 2021 | 2:41 PM

Share

Covid-19 vaccine certificates: కోవిడ్ వ్యాక్సినేషన్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మినహా.. అన్ని ప్రభుత్వాలు నరేంద్రమోదీ ఉన్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌నే మంజూరు చేస్తున్నాయి. గతంలో జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి పీఎం ఫొటోను తొలగించాయి. తాజాగా మరో రాష్ట్రం కూడా ప్రధాని మోదీ ఫొటోను తొలగించింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 18-44 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ సర్టిఫికెట్లలో మోదీ ఫొటోను తొలగించింది. పంజాబ్‌లో భవన నిర్మాణ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్లను వేగంగా వేస్తున్నారు.

అయితే.. టీకాల రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ యాప్ కాకుండా పంజాబ్ కోవా యాప్‌లో నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. టీకాలు తీసుకున్న అనంతరం కేంద్ర కోవిన్ యాప్‌నకు బదులు పంజాబ్‌కు కోవా యాప్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ చిత్రం లేకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ప్రధాని చిత్రాన్ని తొలగించడంతోపాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చిత్రాన్ని కూడా సర్టిఫికెట్లలో చేర్చ లేదని అధికారులు వెల్లడించారు. ఎవరి చిత్రాలు లేకుండా కేవలం తాము టీకా సర్టిఫికెట్లను మాత్రమే జారీ చేస్తున్నామని అధికారులు వివరించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఆయా రాష్ట్రాల సీఎంల ఫొటోలు ఉంటాయని.. కానీ పంజాబ్‌లో అలా ఎవరి ఫొటోలను ఉంచడం లేదని అధికారులు, నాయకులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,000 కోట్లను కేటాయించింది.

Also Read:

Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్.. నివాస ప్రాంతాల్లోకి సముద్రం నీరు.. వీడియో..

Lottery: కాలదన్నుకున్నా.. ఆ మహిళకే వరించిన 7 కోట్ల లాటరీ.. అసలేం జరిగిందంటే..?

Follow Us
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
ధోనీ నుంచి రింకూ దాకా..పది జట్లలో పవర్‌ఫుల్ ఫినిషర్లు వీళ్లే
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
పాన్ కార్డులపై బిగ్ అప్డేట్.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఆ స్టార్ నటుడు చివరి రోజుల్లో తాగి డబ్బు కోసం ఇంటికొచ్చి ..
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
ఈ చిత్రంలో దాగిఉన్న పామును 5 సెకన్లలో కనిపెడితే మరే తోపు
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
మీ ఇంట్లో ఫ్రిజ్ ఇలా ఉందా.. అయితే వెంటనే మార్చుకోండి.. లేదంటే..
బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు వరల్డ్ కప్ 2027 రూల్స్ ఛేంజ్
బౌండరీ లైన్ నుంచి సూపర్ ఓవర్ వరకు వరల్డ్ కప్ 2027 రూల్స్ ఛేంజ్
కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు..
కుమార్తెతో కలిసి ట్యాంకర్‌పై కిమ్‌ మామ షికారు..
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్‌
భార్యభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుందో తెలుసా..? చిన్న తప్పుతో
భార్యభర్తలు ఒకే ప్లేట్‌లో తింటే ఏమవుతుందో తెలుసా..? చిన్న తప్పుతో
ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడితే.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు..
ఆ మూవీ చేయడానికి ఏఎన్నార్ భయపడితే.. ఎన్టీఆర్ ముందుకొచ్చారు..