Harish Rao: నాలుగేళ్ల తర్వాత కొబ్బరికాయ కొడతారట.. ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై మంత్రి హరీష్ సెటైర్లు

తెలంగాణకు ప్రధాని మోడీ వస్తారట.. ఎయిమ్స్‌లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తే.. ఇప్పుడు కొబ్బరి కాయ కొడుతారట.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ టూర్‌పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.

Harish Rao: నాలుగేళ్ల తర్వాత కొబ్బరికాయ కొడతారట.. ప్రధాని మోడీ తెలంగాణ టూర్‌పై మంత్రి హరీష్ సెటైర్లు
Harish Rao On Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 06, 2023 | 12:50 PM

తెలంగాణకు ప్రధాని మోడీ వస్తారట.. ఎయిమ్స్‌లో నాలుగేళ్ల క్రితం మెడికల్ కాలేజ్ వస్తే.. ఇప్పుడు కొబ్బరి కాయ కొడుతారట.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ టూర్‌పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. ఏప్రిల్ 8న (శనివారం) ప్రధాని మోడీ తెలంగాణకు రానున్న నేపథ్యంలో హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క మెడికల్ కాలేజీకు నాలుగేళ్ల తర్వాత కొబ్బరి కాయ కొడితే, మేము గతేడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలకు కొబ్బరికాయలు కొట్టాం.. ఈసారి 9కి కొబ్బరికాయలు కొట్టబోతున్నమ్.. మేము ఎంత చెప్పుకోవాలి.. అంటూ కేంద్ర ప్రభుత్వం ఫైర్ అయ్యారు. బీజేపీది పని తక్కువ ప్రచారం ఎక్కువ, అంతా డబ్బా కొట్టుకోవడమే అంటూ ఎద్దెవా చేశారు. మాది చేతల ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ గారు మాకు అదే చెబుతారు. పని చేసి ప్రజల హృదయం గెలుచుకోమంటారు.. కానీ అబద్దాలు కాదంటూ పేర్కొన్నారు.

40 ఏళ్లు కాంగ్రెస్, 20 ఏళ్లు తెలుగుదేశం వాళ్ళు.. అధికారంలో ఉన్నారని.. ఆ సమయంలో నీళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ హరీష్ రావు ప్రశ్నించారు. 60 ఏళ్లలో చేయనిది కేసీఆర్ 8 ఏళ్లలోనే చేశారన్నారు. అల్లావుద్దీన్ ద్వీపం లేదు, కేసీఆర్ అనే అద్భుత దీపం ఉంది మన దగ్గర అంటూ సీఎంను కొనియాడారు.

కంటివెలుగు పథకం నేటితో కోటి మందికి చేరువ అయిన నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు సంగారెడ్డి, సదాశివపెట్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతిపక్షాలు మెచ్చిన పథకం కంటి వెలుగు.. ముఖ్యమంత్రులు మెచ్చిన పథకం కంటి వెలుగు.. దేశం మెచ్చిన పథకం మన కంటి వెలుగు.. అంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..