AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అతని ఫోన్ సీజ్ చేశారా? బండి సంజయ్ అరెస్ట్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్..

టెన్త్‌ పేపరు లీకేజీలో బండి సంజయ్‌ను కుట్ర పూరితంగా ఇరికించారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. పేపరు లీక్‌పై వరంగల్‌ సీపీ రెండు రోజుల్లో రెండు రకాలుగా చెప్పారని.. పూర్తిగా కట్టు కథలు అల్లారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనుకున్న మాటలన్నీ

Telangana: అతని ఫోన్ సీజ్ చేశారా? బండి సంజయ్ అరెస్ట్‌పై రఘునందన్ సంచలన కామెంట్స్..
Raghunandan Rao
Shiva Prajapati
|

Updated on: Apr 06, 2023 | 1:03 PM

Share

టెన్త్‌ పేపరు లీకేజీలో బండి సంజయ్‌ను కుట్ర పూరితంగా ఇరికించారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. పేపరు లీక్‌పై వరంగల్‌ సీపీ రెండు రోజుల్లో రెండు రకాలుగా చెప్పారని.. పూర్తిగా కట్టు కథలు అల్లారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనుకున్న మాటలన్నీ సీపీ ద్వారా చెప్పించిందని.. సంజయ్‌పై కేసు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు రఘనందన్‌. ఈ కేసులో కీలకంగా ఉన్న శివగణేష్‌ ఫోన్‌ను ఎందుకు సీజ్‌ చేయలేదని ఆయన ప్రశ్నించారు. శివగణేష్‌ ఫోన్‌ నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలకు వాట్సాప్‌ వెళ్లిందో గుర్తించారా అని నిలదీశారు రఘనందన్‌రావు.

బండి సంజయ్‌ను అరెస్ట్‌ చేసి వెంటనే విడుదల చేశామని కరీంనగర్‌ పోలీసులు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వడంపైనా ఎమ్మెల్యే రఘునందన్‌రావు రియాక్ట్‌ అయ్యారు. అరెస్ట్‌ సమయంలో ఒక ఎంపీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు రావడంతో.. వెంటనే ప్లాన్‌ మార్చేసి సంజయ్‌ను కేసులో ఇరికించారని ఆరోపించారు రఘనందన్‌రావు. ఒకవేళ లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు భావిస్తే.. ఒక ఎంపీగా సంజయ్‌ తన హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు.

కొందరు ఐపీఎస్‌ అధికారులు తనపై అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కించపరిచేలా మాట్లాడట లేదని.. ఈ విషయంలో ఎవరికి క్లారిటీ ఇవ్వాలో వారికి ఇచ్చానన్నారు రఘనందన్‌రావు. కావాలంటే ఈ అంశంపై సరైన వైదికపై స్పష్టత ఇస్తానని చెప్పారు. నిన్న బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు ప్రివెంటివ్‌ అరెస్ట్‌ చేశారు. ఆ సందర్భంగా డీజీపీని ఉద్దేశించి ఆయన అభ్యంతరకర కామెంట్స్‌ చేశారంటూ ఐసీఎస్‌ల సంఘం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్