Telangana: మేడారం సమ్మక్క పూజారి సాంబయ్య గుండెపోటుతో మృతి..
మేడారం సమ్మక్క పూజారి సిబ్బబోయిన సాంబయ్య గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ములుగు MLA సీతక్క ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
Medaram : మేడారం సమ్మక్క పూజారి సిబ్బబోయిన సాంబయ్య గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున గుండెనొప్పితో ఇబ్బంది పడుతున్న సాంబయ్యను కుటుంబ సభ్యులు ప్రయివేటు వాహనంలో ఏటూరునాగారం(Eturnagaram) ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.. దీంతో మేడారం పూజారులు, ఆదివాసీలు, మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన సమ్మక్క దేవతను సిద్దబోయిన, చందా, కొక్కెర, ఎంపెళ్లి వంశస్తుల చేతుల మీదుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. సిబ్బబోయిన వంశానికి చెందినవారిలో ఒకరైన సాంబయ్య మొన్నటి మేడారం జాతరలో కూడా చురుకైన పాత్ర పోషించారు.. సమ్మక్క పూజలు నిర్వహించడం, చిలుకల గుట్ట నుండి సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకురావడంలో సహచర పూజారులతో కలిసి చురుకుగా పాల్గొన్నారు. జాతర నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన సిబ్బబోయిన సాంబయ్య గుండెపోటుతో మృతి చెందడం ప్రతి ఒక్కరినీ శోకసంద్రంలో మునిగిపోయేలా చేసింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు(Errabelli Dayakar Rao), సత్యవతి రాథోడ్, ములుగు MLA సీతక్క ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
Also Read: Telangana: అర్ధరాత్రి అక్క ముఖంపై సలాసలా కాగే వేడి నూనె పోసిన చెల్లి.. షాకింగ్ రీజన్