Mahmood Ali: బోయగూడలో అగ్నిప్రమాదం ఘటనాస్థలంలో హోంమంత్రి మహమూద్ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం!
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రంతానికి పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై కాలిన గోడ కూలింది.
Mahmood Ali: తెలంగాణ(Telangana) హోం మంత్రి(Home Minister) మహమూద్ అలీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రంతానికి పరిశీలించేందుకు వచ్చిన ఆయనపై కాలిన గోడ కూలింది. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. బోయిగూడ(Bhoiguda) సమీపంలో ఓ గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే, బోయగూడాలో ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు హోంమంత్రి మహమ్మద్ అలీ అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల వివరాలను ఆరా తీశారు. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన గోడ మొత్తం కూలిపోయింది. అందుకు కొన్ని సెకన్ల ముందే అక్కడి నుంచి హోం మంత్రి అలీ వెళ్లిపోయారు. మీడియా పాయింట్‌కు రావడంతో ప్రమాదం తప్పినట్టయింది.
అనంతరం హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. స్క్రాప్ గోదాం ఘటన పై అధికారులతో విశ్లేషిస్తున్నామన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. హైదరాబాదులో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయో, ఎలాంటి చర్యలు చేపట్టాలో సమావేశంలో చర్చిస్తామన్నారు. ఇరుకు సందుల్లో, నివాసం ప్రాంతాల్లో ఇలాంటి స్క్రాప్ గోదాంలో హైదరాబాదులో చాలా ఉన్నాయి. అయితే, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతామని మహమూద్ అలీ స్పష్టం చేశారు..