Telangana Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు ఉచిత శిక్షణ.. ఎక్కడ, ఎలా నమోదు చేసుకోవాలంటే?
ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈమేరకు భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రిపరేషన్‌కు సిద్ధమవుతున్నారు.
Telangana Govt Jobs: ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈమేరకు భారీగా ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రిపరేషన్‌కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ఖర్చుచేసి శిక్షణ తీసుకోలేకపోతున్న ఉద్యోగార్థుల కోసం పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, అన్ని జిల్లాల్లో ఉచిత శిక్షణ(Free Coaching) కోసం పోలీస్ శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభింమచిన ‘టీశాట్’ నుంచి కూడా ఓ గుడ్ న్యూస్ వచ్చింది. కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు అన్ని ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్‌వర్క్(టీ-శాట్) ప్రకటించింది. అయితే ఇది ఆన్‌లైన్ ఉండనున్నట్లు టీ-శాట్ సీఈవో ఆర్.శైలేష్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిన్నట్లుగా పలు శాఖల్లో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం పోటీపడే వారికి, నోటిఫికేషన్లలో వెల్లడించే సిలబస్ మేరకు వీడియోల రూపంలో ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈమేరకు నిపుణ, విద్య ఛానల్స్‌లో స్పెషల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో కేవలం శిక్షణ మాత్రమే కాదని, ఉద్యోగార్థులకు ప్రతివారం మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు కూడా తగిన ఏర్పాట్లు జరగుతున్నాయని ఆయన తెలిపారు. కాగా, కరోనా సమయంలో స్టూడెంట్స్‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడంలో నిపుణ, విద్య ఛానల్స్ ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కేవలం కోరోనా సమయంలోనే కాదు.. ఇప్పటికీ ఈ ఛానల్స్ ద్వారా స్టూడెంట్స్‌రే ఆన్‌లైన్ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో నిర్వహించే భారీ కొలువుల జాతరకు కూడా ఉచిత శిక్షణకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్.శైలేష్‌రెడ్డి పేర్కొన్నారు.
అందుబాటులో 1500 గంటల వీడియో కంటెంట్..
పోటీ పరీక్షలలో కీలకమైన జనరల్ స్టడీస్, ఎకానమీ, చరిత్ర, గణిత సామర్థ్యం, జనరల్ సైన్స్, ఇంగ్లిష్, రీజనింగ్ లాంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు ఆయన తెలిపారు. విద్య, నిపుణ ఛానళ్ల ద్వారా ఈ కంటెంట్‌ను వీడియోల రూపంలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కరెంట్ ఎఫైర్స్‌పై కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించనున్నట్లు, ఆయా నెలల్లో చోటు చేసుకున్న కీలక విషయాలను వీడియోల రూపంలో అందించనున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్లు విడుదలయ్యాక, అందులో పేర్కొన్న సిలబస్ మేరకు అందించన్నున్నారు. ఏప్రిల్ నెల నుంచి స్పెషల్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఇప్పటికే టీ శాట్ వద్ద 1500 గంటలకు పైగా వీడియో కంటెంట్ అందుబాటులో ఉందని, కానిస్టేబుల్ నుంచి గ్రూప్-1 వరకు సిలబస్ ప్రకారం వీడియో కంటెంట్ అందుబాటులో ఉందని, నోటిఫికేష్ ప్రకారం వీటిని వేరు చేస్తున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఈ వీడియో కంటెంట్ కూడా టెలికాస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొ్నారు.
వీడియో కంటెంట్ కోసం ఎలా నమోదు చేసుకోవాలంటే..
టీశాట్ వెబ్, మొబైల్ యాప్‌లో మొబైల్ నంబరు లేదా సోషల్ మీడియా అకౌంట్లతో నమోదు చేసుకోవచ్చని టీ-శాట్ సీఈవో ఆర్.శైలేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలా నమోదు చేసుకున్న వారికే మాక్ టెస్ట్‌లు రాసేందుకు అవకాశం ఉంటుదని ఆయన అన్నారు. మాక్ టెస్టుల తర్వాత, పూర్తి వివరాలను అంటే ఎంత వరకు సరైన సమాధానాలు పెట్టారు, ఎన్ని తప్పుగా పెట్టారో కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంది. వీటిని ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. అయితే, శిక్షణలో ఎలాంటి అవాంతరాలకు చోటు లేకుండా చేస్తున్నట్లు పేర్కొ్న్నారు.
క్లాసులు విన్న తర్వాత ఆన్‌లైన్లో మాక్ టెస్టులు రాసుకొవచ్చు. ఈ ఎగ్జామ్స్‌ను ఎప్పుడైనా రాసుకోవచ్చని ఆయన తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ నుంచి సిలబస్ ప్రకారం మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. సో ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే టీశాట్ మొబైల్ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని ఉచితంగా శిక్షణతో మరింత మెరుగవ్వండి.
NEPA Jobs: పదో తరగతి అర్హతతో.. నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో గ్రూప్ సీ ఉద్యోగాలు..!