AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భక్తుల పయనం

రాష్ట్ర ప్రజలకు ఎంతో విశిష్టమైన మేడారం మహా జాతర నేటి నుండి ఆరంభం కానుంది. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. బుధవారం నుంచి ఈ జనవరి 31 వరకు (జనవరి 28,29,30,31 తేదీల్లో) వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని..

Medaram Jatara: నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భక్తుల పయనం
Sammakka Sarakka Jatara
Srilakshmi C
|

Updated on: Jan 28, 2026 | 7:39 AM

Share

మేడారం, జనవరి 28: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో విశిష్టమైన మేడారం మహా జాతర నేటి నుండి ఆరంభం కానుంది. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. బుధవారం నుంచి ఈ జనవరి 31 వరకు (జనవరి 28,29,30,31 తేదీల్లో) వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రూ.251 కోట్ల నిధులతో సర్కార్ సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించింది. అంతేకాకుండా భక్తులకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించింది. ఇక సారలమ్మ జాతరతో మొదలై మొత్తం నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది.

ఈ రోజు సాయంత్రం గద్దెల పైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం చేయనున్నారు. కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలను గద్దెలపై పూజారులు ప్రతిష్టించనున్నారు. కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాళీ నడకన బయలుదేరారు. పగిడిద్దరాజు పూజారులు పూనుగొండ్ల నుండి 65 కి.మీ నడుచుకుంటూ మేడారంకు వస్తున్నారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకనున్నారు.

ఈసారి రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు కోటి మంది వరకు తరలిరానున్నట్లు అంచనా. మేడారం మహాజాతరకు ఈసారి పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు తొలిసారిగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్తు, గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీసు, ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక మొదలవగా.. ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సకల ఏర్పాట్లు పూర్తి
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
'యానిమల్' సీక్వెల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
డేంజరస్ బంతికి క్లీన్‌బౌల్డ్.. కట్‌చేస్తే.. ట్విస్ట్ చూస్తే షాకే
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
FTUతో ఒక్క రోజులో రూ.18 వేల కోట్ల నష్టం!
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ జైత్రయాత్ర..సూపర్-6లో బోణీ అదిరింది
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
ఆఫీస్ బ్యాగ్‌లో ఇవి ఉంటే దరిద్రమే.. మీ కెరీర్ బాగుండాలంటే వెంటనే
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
అర్జిత్ సింగ్ ఒక్కో సాంగ్‌కు ఎంత తీసుకుంటాడు? మొత్తం ఆస్తులెంత?
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఎందుకంటే?
ఈసారి అన్ని ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లపై QR కోడ్‌.. ఎందుకంటే?
రెండు విడతల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు..
రెండు విడతల్లో కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు..
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి
మొబైల్ హ్యాక్ అవ్వకుండా గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్స్ చేసుకోండి