Income Tax Jobs 2026: పదో తరగతి అర్హతతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో.. స్పోర్ట్స్ కోటాలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా..

ముంబయి రీజియన్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (Pr.CCIT).. స్పోర్ట్స్ కోటాలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 97 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా.. మరో 4 రోజులు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 31, 2026వ తేదీ తుది గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టుల సంఖ్య: 12
- ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 47
- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల సంఖ్య: 38
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి లేదా ఇంటర్ లేడా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాట్‌మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, లాన్ టెన్నిస్, క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీ బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, బిలియర్డ్స్ వంటి తదితర స్పోర్ట్స్‌లలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా జనవరి 31, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.200 చొప్పున చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే సంబంధిత క్రీడాల్లో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు స్టెనోగ్రాఫర్ & ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




