Watch Video: పురాతన శ్రీలక్ష్మి దేవి ఆలయంలో భారీ చోరీ.. రాత్రికి రాత్రే నగలతో పరార్!
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రం ముదిరాజ్ కాలనీలో పురాతన శ్రీలక్ష్మి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గురువారం రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుడిలో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, 4.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు..

భీమారం, అక్టోబర్ 17: రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రం ముదిరాజ్ కాలనీలో పురాతన శ్రీలక్ష్మి దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. గురువారం రాత్రి గుర్తు తెలియని కొందరు దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో గుడిలో ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలు, 4.5 కిలోల వెండి ఆభరణాలతో పాటు రూ.35వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయం సంఘం పెద్దలు తెలిపారు. విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ లతో దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కాగా గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురాతన దేశాలయాల్లో వరుస చోరీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల దేవాలయాల్లోని హుండీలు, విగ్రహాలకు అలంకరించిన ఆభరణాలనే కాకుండా విగ్రహాల కింద నిధి ఉందంటూ గుర్తు తెలియని దుండగులు ఎన్నో గుడులను ధ్వంసం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




