రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్.. అప్పట్లో ఊపేసింది
చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు హీరోలకు సమానంగా సినిమాలు చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ సినిమాలు కూడా చేస్తూ అలరిస్తున్నారు. అలాగే రెమ్యునరేషన్స్ కూడా హీరోలకు సమానంగా తీసుకుంటున్నారు. కోటి రూపాయిలు తీసుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన భారీ బడ్జెట్ సినిమాలే తెరకెక్కుతున్నాయి. మినిమమ్ రూ. 20 నుంచి రూ. 100కోట్ల కు పైగా బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. సినిమాల రిజల్ట్స్ కూడా లానే ఉంటున్నాయి. కొన్ని సినిమాలు వేల కోట్లు వసూల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే సినిమా బడ్జెట్ తో చాలా భాగం హీరోలు, హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ కే వెళ్ళిపోతుంది. కాగా ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది హీరోలకంటే ఎక్కువ పారితోషకం అందుకుంటున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. కాగా టాలీవుడ్ లో రూ. 1 రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో చెప్తే షాక్ అయ్యిపోతారు. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆ ముద్దుగుమ్మ, ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. సమంత, కాజల్ , అనుష్క అనుకుంటారేమో.. కానీ కాదు. ఆమె మరెవరో కాదు ఒకప్పటి హాట్ బ్యూటీ ఇలియానా. రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఇలియానా. ఆతర్వాత పోకిరి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ అమ్మడు.
చాలా కాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణించిన ఇలియానా అప్పటికే ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. తొలి కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. రవితేజ హీరోగా నటించిన ఖతర్నాక్ సినిమాకు ఇలియానా కోటి రూపాయిలు అందుకుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాలలో నటించిన ఈ బ్యూటీ.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో డేటింగ్ లో ఉన్న ఇప్పుడు తల్లిగా మారి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




