Sai Pallavi: 47 ఏళ్ల హీరోకు జోడీగా సాయి పల్లవి..!! వర్కౌట్ అవుతుందా..?
సాయి పల్లవిని ఇష్టపడని ప్రేక్షకులు ఉంటారా.? ఉండరనే చెప్పాలి.. ఈ ముద్దుగుమ్మను ఈ తరం సౌందర్య అని ఎంతో మంది పిలుచుకుంటున్నారు. ఎక్కడా స్కిన్ షో చేయకుండా కేవలం తన నటనతో ఎంతో ,మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చిన్నది. సాయి పల్లవి సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో గ్లామర్ షో, బోల్డ్ రోల్స్ జోలికి వెళ్లకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల చందమామ సాయి పల్లవి. చూడముచ్చటి రూపం, ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పటికీ ఈ అమ్మడు తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తుంది ఈ అమ్మడు. నేచురల్ బ్యూటీగా ఈ చిన్నది మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో తండేల్ సినిమాతో హిట్ అందుకుంది. అలాగే తమిళ్ లో అమరన్ సినిమాతో హిట్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో సినిమా చేస్తుంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సాయి పల్లవి. ఈ సినిమాలో రణబీర్ రాముడిగా కనిపిస్తుండగా.. సాయి పల్లవి సీతగా కనిపించనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో భారీ సినిమాలో సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది.
తమిళ్ లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నవాబ్ సినిమాలో విజయ్ సేతుపతి నటించారు. మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. కాగా ఈ సినిమాను ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారట మణిరత్నం. కాగా విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి సెట్ అవుతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ సేతుపతికు సాయి పల్లవి కూతురిగా ఉంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగా సాయి పల్లవి విజయ్ సరసన నటిస్తుందా లేక మరేదైనా పాత్రలో కనిపిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




