AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwi Fruit: 15రోజుల పాటు రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్‌ అవుతారు..

కివి ఇతర పండ్ల కంటే కొంచెం ఖరీదైనది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. 15 రోజుల పాటు ప్రతిరోజూ ఒక కివి పండు తినడం వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి దీన్ని ఎవరు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

Kiwi Fruit: 15రోజుల పాటు రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్‌ అవుతారు..
Kiwi Fruit
Jyothi Gadda
|

Updated on: Dec 08, 2025 | 12:18 PM

Share

కివి అనేది రుచి, ఆరోగ్యానికి నిధిగా పిలుస్తారు. ఇది గోధుమ రంగు చర్మం, లోపల మృదువైన ఆకుపచ్చ గుజ్జును కలిగి ఉంటుంది. ఇందులో చిన్న నల్ల విత్తనాలు కూడా ఉంటాయి. కివి ఇతర పండ్ల కంటే కొంచెం ఖరీదైనది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. 15 రోజుల పాటు ప్రతిరోజూ ఒక కివి పండు తినడం వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు లభిస్తాయి. కాబట్టి దీన్ని ఎవరు తినాలో ఇక్కడ తెలుసుకుందాం..

కివి పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

కివిలోని ఆక్టినిడిన్ ఎంజైమ్ ప్రోటీన్‌ను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మీకు జీర్ణ సమస్యలు ఉంటే, మీరు ఈ పండును ప్రతిరోజూ తినవచ్చు. కివిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మంచి బాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

రోజూ కివీ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సి, ఇ చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. ఆరోగ్యకరమైన, యవ్వనమైన చర్మాన్ని అందిస్తాయి. కివీలో లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును కాపాడటంలో, వయసు సంబంధిత సమస్యల నుంచి కళ్లను రక్షించడంలో ముఖ్యమైనవి.

కివి తినడం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటంతో బరువు తగ్గడానికి కివీ ఉపయోగపడుతుంది. లభించే సమ్మేళనాలు ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఎముకలకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కివిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీరు అనేక కాలానుగుణ అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

కివిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కివిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కివిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
జారిన మహిళ దవడ.. పానీ పూరి కోసం నోరు బార్లా తెరవడంతో
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
పడుకునే ముందు టీవీని ఎందుకు అన్‌ప్లగ్ చేయాలి? 99% మందికి తెలియదు!
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
ఏలియన్స్‌కు టెంపుల్‌ గ్రహాంతరవాసికి ఘనంగా పూజలు
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
రోజుకు ఒక కివి పండును తింటే శరీరంలో జరిగేది ఇదే..! తెలిస్తే షాక్
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
మంచం కింద ప్రియుడు.. దుబాయ్‌లో భర్త.. దొంగ అనుకుని చితక్కొట్టిన..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
రూ.కోటి రూపాయిలు రెమ్యునరేషన్ అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్..
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
మొబైల్‌ దగ్గర ఉంటే ఏమవుతుందో తెలుసా?
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'
ప్రపంచ నలుదిక్కులు వినిపించేలా 'తెలంగాణ రైజింగ్ నినాదం'
విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!
విద్యార్థులకు శుభవార్త.. మళ్లీ పాఠశాలలకు వరుస సెలవులు..!
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !
ఆ గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరీ..కారణం తెలిస్తే షాకే !