AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అనుమానాస్పదంగా వివాహిత మృతి.. భర్త, అత్తమామలే హత్య చేశారని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు

మూడు సంవత్సరాల క్రితం సన్ సిటీకి చెందిన హారతిని నంది ముసలిగుడాకు చెందిన సంతోష్ రెడ్డి తో వివాహం జరిగింది. ఈ దంపతులకు  సంవత్సరన్నర పాప కూడా ఉంది. గత కొద్ది రోజుల నుంచి భర్త సంతోష్ తో పాటు అత్తమామల తో హారతి కి గొడవలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది

Hyderabad: అనుమానాస్పదంగా వివాహిత మృతి.. భర్త, అత్తమామలే హత్య చేశారని ఆరోపిస్తున్న తల్లిదండ్రులు
Hyderabad News
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Aug 12, 2023 | 1:55 PM

Share

ఈ మధ్యకాలంలో వివాహిత ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి..పెళ్లి అయిన కొద్దీ రోజులకే.. అత్తింటి వేధింపులు భరించలేక అటు తల్లిదండ్రులకు విషయాలను చెప్పుకోలేక మధ్యలోనే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు మహిళలు. కారణాలు ఏవైనా చావు ఒకటే మార్గంగా భావించిన కొంతమంది మహిళలు కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తీరని విషాదంలో మునిగిపోతున్నారు. మళ్ళీ హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. వివాహిత మృతికి అత్తింటి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నంది ముసలైగుడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడు సంవత్సరాల క్రితం సన్ సిటీకి చెందిన హారతిని నంది ముసలిగుడాకు చెందిన సంతోష్ రెడ్డి తో వివాహం జరిగింది. ఈ దంపతులకు  సంవత్సరన్నర పాప కూడా ఉంది. గత కొద్ది రోజుల నుంచి భర్త సంతోష్ తో పాటు అత్తమామల తో హారతి కి గొడవలు జరుగుతున్నాయి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో హారతి ఇరుకుటుంబ సభ్యులు అల్లుడు ఫ్యామిలీతో మాట్లాడి.. గొడవ సర్దుమనిగేలా చేశారు. అయినా సంతోష్ రెడ్డి లో మార్పు రాలేదు.

తరచూ భర్త సంతోష్ రెడ్డి, అత్తమామలు తనను వేధింపులు గురి చేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గురువారం సంతోష్ రెడ్డి కుటుంబ సభ్యులు సన్ సిటీ లో నివసిస్తున్న హారతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కూతురు ఆరోగ్యం బాలేదని చెప్పారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు హడావుడిగా హారతిని చూసేందుకు నంది ముసలై కూడా కు చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికే హారతి మంచం పై పడుకొని మిగతా జీవిగా ఉంది. కన్న కూతురు మృతదేహాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డను హత్య చేశారని ముమ్మాటికి ఇది సంతోష్ రెడ్డి అత్తమామల వేధింపులే కారణమని హారతి కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్