AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage Muhurat 2025: పెళ్లికాని ప్రసాదులకు శుభ గడియలు.. మరో 2 నెలలు అన్నీ మంచి ముహుర్తాలే!

మాగమాసం ప్రారంభమైంది. పెళ్లి చేసుకోవాలని ఉవ్విళూరుతున్న యువతకు ఇక అన్నీ మంచి ముహూర్తాలే. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకునే వారికి జూన్‌ వరకు బోలెడన్ని శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ మేరకు పండితులు ముహూర్తాల తేదీలు వెల్లడించారు. పైగా ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఎంతో మందికి జోవనోపాధి కూడా దొరకుతుంది..

Marriage Muhurat 2025: పెళ్లికాని ప్రసాదులకు శుభ గడియలు.. మరో 2 నెలలు అన్నీ మంచి ముహుర్తాలే!
Marriage
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 03, 2025 | 4:25 PM

Share

హైదరాబాద్, ఫిబ్రవరి 3: పెళ్లి చేసుకోవాలని ఉవ్విళూరుతున్న యువతకు ఇదొక శుభవార్త. ఎప్పుడెప్పుడా శుభ ఘడియలు వస్తాయని ఎదురుచూస్తున్న వారికి ఆ సమయం దగ్గరగా వచ్చేసింది. ఎన్నో కలలతో, ఆశలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని, భాగస్వామిని తమ జీవితంలోకి ఆహ్వానించాలని చూస్తున్న వారికి ఇప్పుడు ఇది మంచి పరిణామం. మాఘ మాసం ప్రారంభం కావటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జనవరి 31 నుంచి మార్చి 16 వరకు చాలా మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయట. అయితే.. ఇందులో కూడా ముఖ్యంగా ఫిబ్రవరి 16, మార్చి 16 ఈ రెండు తేదీల్లో మరిన్ని ఎక్కువగా పెళ్లిళ్లు జరగనున్నాయని మలక్‌పేటకు చెందిన వాస్తు పండితులు సింగిరి శ్రీనివాస్ తెలియజేశారు.

పెళ్లిళ్ల సందడి మొదలైందంటే చేసుకునేవాళ్లకు సంబరం ఉంటుందేమో కానీ, దాని వల్ల ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతుంది. వివాహ శుభ కార్యాలకు సంబంధించి 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. వారికి చేతి నిండా పని దొరుకుతుంది. దీంతో వచ్చే రెండు నెలల్లో సగానికి పైగా రోజులు పెళ్లిళ్ల నిమిత్తం కళ్యాణ మండపాలు బుకింగ్ కూడా అయిపోతున్నాయి. ఇక పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్ల సంగతి చెప్పక్కర్లేదు. వారికి ఈ రెండు నెలలు ఎంత డిమాండ్ ఉంటుందో తెలిసిన సంగతే. మరోవైపు.. క్యాటరింగ్, వస్త్ర వ్యాపారులు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ మొదలైన వాటికి ఈ పెళ్లిళ్ల సీజన్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే పెళ్లి నిర్ణయించుకున్న వాళ్లు షాపింగ్ మాల్స్ చుట్టూ బట్టలు వంటి కావల్సిన వస్తువులు కొంటున్నారు. దీంతో నగరంలో బడా బడా మాల్స్ వద్ద రద్దీ విపరీతంగా నెలకొంది. షాపింగ్ నిమిత్తం వచ్చేవారితో షాపులన్నీ సందడిగా మారాయి.

ఇవి కూడా చదవండి

శుభ ముహూర్తాల తేదీలు నెలల వారీగా ఇలా..

  • ఫిబ్రవరి నెలలో శుభ ముహూర్తాలున్న తేదీలు.. 2, 3, 7, 13, 14, 15, 18, 19, 20, 21, 23, 25
  • మార్చి నెలలో.. 1, 2, 6, 7, 12
  • ఏప్రిల్ నెలలో.. 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
  • మే నెలలో.. 1, 5, 6, 8,15, 17, 18
  • జూన్ నెలలో.. 1, 2, 4, 7

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..