Telangana: చికెన్ వండలేదని పగతో రగిలిన భర్త.. అర్థరాత్రి భార్యను చంపి, చికెన్ కవర్‌తో పరార్..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇష్టమైన చికెన్ కూర వండలేదని భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. తీవ్రంగా గాయపడిన భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిందని నిర్దారణకు వచ్చాక..
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇష్టమైన చికెన్ కూర వండలేదని భార్యను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. తీవ్రంగా గాయపడిన భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య చనిపోయిందని నిర్దారణకు వచ్చాక.. భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తనకు ఇష్టమైన చికెన్ కూర వండకుండా వంకాయ కూర వండిదని రాత్రంతా కోపంతో ఉన్న భర్త పోశం.. నిద్రమత్తులో ఉన్న భార్యను అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని చెన్నూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో గాలిపెల్లి పోశం (50), శంకరమ్మ దంపతులు నివసిస్తున్నారు. నిన్న రాత్రి భర్త గాలిపెల్లి పోశం పుల్లుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగే చికెన్ తీసుకొచ్చి వండిపెట్టాలంటూ భార్యకు ఆర్డర్ వేశాడు. అలిసిపోయిన భార్య నేను వండలేనంటూ తెగేసి చెప్పింది. కూర విషయంలో తలెత్తిన గొడవతో ఆవేశానికి గురైన భర్త పోశం.. భార్య నిద్రలోకి జారుకోగానే తెల్లవారు జామున అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. చికెన్ వండమంటే.. వంకాయ కూర వండుతావా అంటూ గట్టిగా అరుస్తూ విచక్షణారహితంగా దాడి చేశాడు. భార్య చనిపోయిందని నిర్దారించుకున్నాక వండని చికెన్ పట్టుకుని పరార్ అయినట్టు సమాచారం. పోశం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జనాల్లో శాడిజం ఎంత పెరిగిపోయిందో ఈ దారుణాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..