Telangana: రావణ కాష్ఠంగా ఆ గ్రామం.. సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయలేదని కుల బహిష్కరణ!
ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలను వ్యక్తి గతంగా తీసుకొని పంచాయతీల మంట ఆ గ్రామంలో కొనసాగిస్తున్నారు. ఇంకొంత మంది అయితే తమకు ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

సర్పంచ్ ఎన్నికలు ముగిసాయి. కానీ పగలు, ప్రతీకారాలు మాత్రం ఇంకా కొన్ని చోట్ల మిగిలే ఉన్నాయి. ఎన్నికల్లో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కొందరు.. తమకు నచ్చినవాడు గెలిచాడంటూ మరికొందరు.. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలను వ్యక్తి గతంగా తీసుకొని పంచాయతీల మంట గ్రామంలో కొనసాగిస్తున్నారు. ఇంకొంత మంది అయితే తమకు ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ..
తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన చెల్లారం మధుసూదన్ రెడ్డి ఎలక్షన్లో తమకు ఓటు వేయలేదని గత కొన్ని రోజులుగా ఓ వర్గం అతనిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకొని రాత్రి గ్రామంలోని రెడ్డి సంఘానికి మధుసూదన్ రెడ్డి పిలిపించి, అతని పై దాడి చేసి కుల బహిష్కరణ చేసి సంఘం నుండి బహిష్కరించారు. దీనికి ప్రధాన సూత్రధారి చెల్లారం వెంకట కృష్ణరెడ్డి అని.. బాధితుడు మధుసూదన్ రెడ్డి అంటున్నాడు.
సర్పంచ్ ఎన్నికల్లో తమ రెడ్డి కులానికి కాదని.. తన మద్దతు ముదిరాజ్ కులానికి ఎలా ఇస్తావ్ అంటూ నాటా బూతులు తిడుతూ తమ ఇంటి పైకి వచ్చి, గోడ్డలితో నరికే ప్రయత్నం చేశాడని.. అడ్డుకున్న కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేశారని తమ సెల్ ఫోన్ తో పాటు, జేబులో ఉన్న 56 వేల రూపాయలు కూడా తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. పంచాయతీ ఎన్నికల్లో తమ కులానికి మద్దతు ఇవ్వలేదని, కుల బహిష్కరణ చేసి తమను చంపేస్తామని బెదిరించినట్లు వాపోయాడు. ఎన్ని రోజులకైనా నా చేతుల్లోనే నువ్వు చస్తావని బెదిరించాడని బాధితుడు మీడియాకు తెలిపాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




