Khammam: సంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం అభ్యర్థి ఎంపిక.. టికెట్‌ కేటాయింపులో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా స్థానికుడైన రామసహాయం రఘురాంరెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇన్నాళ్లు స్థానికేతరులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వడం వెనక వ్యూహమేంటి..? అభ్యర్థి ఎవరైనా ఖమ్మంలో గెలుస్తామన్న ధీమానే కారణమా..? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.

Khammam: సంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం అభ్యర్థి ఎంపిక..  టికెట్‌ కేటాయింపులో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
Ramasahayam Raghuram Reddy
Follow us

|

Updated on: Apr 25, 2024 | 8:03 AM

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా స్థానికుడైన రామసహాయం రఘురాంరెడ్డి పేరును కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఇన్నాళ్లు స్థానికేతరులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వడం వెనక వ్యూహమేంటి..? అభ్యర్థి ఎవరైనా ఖమ్మంలో గెలుస్తామన్న ధీమానే కారణమా..? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది.

సంప్రదాయానికి భిన్నంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసింది కాంగ్రెస్‌. గత కొన్ని రోజులుగా టికెట్‌ ఎవరికి ఇస్తారోనన్న చర్చ తీవ్రస్థాయిలో సాగింది. మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు కొందరు లోకల్‌, నాన్‌ లోకల్‌ నేతల పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే పలువురి పేర్లను పరిశీలించిన అధిష్ఠానం, చివరికి రామసహాయం రఘురాంరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. ఇన్నాళ్లు స్థానికేతరులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ఖమ్మం టికెట్‌ ఇవ్వగా.. ఈసారి మాత్రం రెడ్డి సామాజికవర్గం వైపు కాంగ్రెస్‌ పార్టీ మొగ్గుచూపింది.

కమ్మ సామాజిక వర్గానికే టికెట్ దక్కబోతుందన్న సమాచారం వారం రోజులుగా చక్కర్లు కొట్టింది. అది కూడా నాన్‌ లోకల్‌ను బరిలో నింపబోతున్నారన్న వార్త చక్కర్లు కొట్టింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావును ఇక్కడి నుంచి బరిలో దింపుతారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగింది. ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు కన్‌ఫామ్ అయ్యిందన్న సమాచారం కూడా జిల్లా నేతలకు అందింది. అయితే చివరి నిమిషంలో ఎవరు ఊహించని పేరు తెరపైకి వచ్చింది. ఆయనే రామసహాయం రఘురాంరెడ్డి.

ఖమ్మం లోక్‌సభ స్థానానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ అభ్యర్థులే పదకొండు సార్లు గెలిచారు. మిగతా ఆరుసార్లు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు పట్టం కట్టారు. గెలిచిన 10 మందిలో ఐదుగురు స్థానికేతరులే. అయితే ఈసారి స్థానికుడైన రఘురాంరెడ్డికి టికెట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్ఠానం.

ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గ వ్యక్తికి టికెట్‌ కేటాయించడంతో కాంగ్రెస్‌ పార్టీ వ్యూహమేంటి.. అన్న దానిపై చర్చ జరుగుతోంది. రఘురాంరెడ్డి లోకల్‌ కావడం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వియ్యంకుడు కావడంతోనే టికెట్‌ ఇచ్చారా లేక ఉమ్మడి ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టు ఉండడంతో అభ్యర్థి ఎవరైనా గెలుస్తారన్న ధీమాతోనే రెడ్డి వర్గానికి టికెట్‌ కేటాయించారని చర్చ జరగుతోంది.

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు గానూ 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించినప్పటికీ.. మూడు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ప్రధానంగా ఖమ్మం సీటును అటు మంత్రుల కుటుంబసభ్యులు, ఇటు సీనియర్ నేతలు కేటాయించాలని కోరడం అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఖమ్మం జిల్లా మంత్రులతో ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధిష్ఠానం పెద్దలు.. రఘురాంరెడ్డి పేరును ఫైనల్‌ చేశారు. అయితే మంగళవారం రోజునే రామసహాయం రఘురాంరెడ్డి తరఫున రెండు సెట్ల నామినేషన్లను ఆ పార్టీ నేతలు దాఖలు చేశారు.

కాంగ్రెస్ మార్క్ తాజా రాజకీయం విశ్లేషకులకు సైతం అంతుపట్టడం లేదు. కమ్మ సామాజిక వర్గానికే అక్కడ పట్టు ఉందన్నదీ అందరికి తెలిసిన విషయమే. మిగతా ఎంపీ స్థానాలు వేరు, ఖమ్మం వేరు. కానీ, ఇక్కడ సరికొత్తగా రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపి సాహసం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే దీని వెనక లెక్కేంటి? ఫలితం ఎలా ఉండబోతుందన్నది తేలాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..,

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..