AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha 2024 Election Results: తెలంగాణలో భారీగా పెరిగిన బీజేపీ స్థానాలు.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

తెలంగాణలో కమలం పార్టీ పెర్ఫామెన్స్‌ పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా.. ఈసారి డిజిట్‌ డబుల్‌ అయింది. నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు కాషాయపార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రధాన కారణం కిషన్‌ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా వెళ్లింది. అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు సాధిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీ సాధించింది.

Lok Sabha 2024 Election Results: తెలంగాణలో భారీగా పెరిగిన బీజేపీ స్థానాలు.. కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 05, 2024 | 10:13 AM

Share

తెలంగాణలో కమలం పార్టీ పెర్ఫామెన్స్‌ పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా.. ఈసారి డిజిట్‌ డబుల్‌ అయింది. నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు కాషాయపార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రధాన కారణం కిషన్‌ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా వెళ్లింది. అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు సాధిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. మోదీ హవా.. కిషన్‌ రెడ్డితోపాటు.. కాషాయపార్టీ లోయర్‌ క్యాడర్‌ చురుగ్గా పనిచేయడంతో ఇన్ని సీట్లు సాధించగలిగింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40శాతం ఓట్లు వస్తే.. బీజేపీ 35శాతం ఓట్లు సాధించింది. ఈ ఓట్లన్నీ ఉత్తర తెలంగాణ, గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే వచ్చాయి. బీఆర్‌ఎస్‌ 17శాతం లోపు ఓట్లకే పరిమితం అయింది. కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించడమేకాకుండా.. మంచి స్ట్రాటజీతో.. పర్ఫెక్ట్‌ క్యాండిడేట్‌ సెలక్షన్‌తో మిగిలిన నియోజకవర్గాల్లోనూ సత్తా చూపించారు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మెదక్‌, మహబూబ్‌నగర్‌ స్థానాలను కైవసం చేసుకోవడంలో కిషన్‌ కీలకపాత్ర పోషించారు. బూత్‌స్థాయి నుంచి కేడర్‌ను ఉత్తేజపరుస్తూ.. వారికి దిశానిర్థేశం చేస్తూ ముందుకెళ్లారు కిషన్‌. పదేళ్ల క్రితం బీజేపీ పరిస్థితికి.. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి చాలా తేడా ఉంది. అప్పుడు అసెంబ్లీలోనే ఒక సీటు సాధించేందుకు తంటాలుపడ్డ కాషాయపార్టీ.. ఇప్పుడు గౌరవప్రద స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలందరికీ కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్రమోదీని, అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టారంటూ కిషన్ రెడ్డి తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో 8 స్థానాలు గెలిచి రికార్డు సాధించామన్నారు. డబుల్ డిజిట్ రావాలన్న ఆకాంక్షతో పనిచేశామని.. రెండు, మూడు స్థానాల్లో గెలివాల్సి ఉందని.. కానీ కొన్ని కారణాలతో ఓడిపోయామని తెలిపారు.

కిషన్ రెడ్డి వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి