సారూ.. నేను సచ్చిపోలేదు బతికే ఉన్నా..! భరోసా లేకుండా రికార్డుల్లో చంపేసిన అధికారులు
సారూ... నేను బతికే ఉన్నా.. అధికారులు మాత్రం నేను సచ్చిపోయానంటున్నారు. బ్రతికే ఉన్నావని ఆధారాలు తేవాలంటున్నారు. చెట్టంత మనిషిని మీ ముందే ఉన్నా.. అయినా సచ్చిపోయానంటూ రికార్డుల్లోకి ఎక్కించి.. నా భూమిని లాగేసుకున్నారు.. ఇదెక్కడి న్యాయం సార్.. ఇలా రైతు భరోసా సాయం అందకుండా చేశారు. అంటూ ఓ మహిళా రైతు బోరున విలపిస్తోంది.

సారూ… నేను బతికే ఉన్నా.. అధికారులు మాత్రం నేను సచ్చిపోయానంటున్నారు. బ్రతికే ఉన్నావని ఆధారాలు తేవాలంటున్నారు. చెట్టంత మనిషిని మీ ముందే ఉన్నా.. అయినా సచ్చిపోయానంటూ రికార్డుల్లోకి ఎక్కించి.. నా భూమిని లాగేసుకున్నారు.. ఇదెక్కడి న్యాయం సార్.. ఇలా రైతు భరోసా సాయం అందకుండా చేశారు. అంటూ ఓ మహిళా రైతు బోరున విలపిస్తోంది. నేను బ్రతికే ఉన్నానని గుర్తించండి అంటూ అధికారులను వేడుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం..
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం దస్నాపూర్ కు చెందిన తాల్లపల్లి పద్మ తనను అధికారులు రికార్డుల్లో చనిపోయారంటూ పేర్కొన్నారని ప్రజావాణిలో ఎంపీడీవో కుమారస్వామికి, ఎంఏవో వీరన్నకు ఫిర్యాదు చేసింది. తనది దస్నాపూర్ గ్రామమని.. గ్రామ శివారులోని సర్వేనంబర్ 98లో 25 గుంటల భూమి ఉందంటూ పేర్కొంది. ఏడేళ్ల క్రితం తన భర్త తిరుపతి గౌడ్ అనారోగ్యంతో మృతి చెందడంతో తన భర్త పేరు మీద ఉన్న భూమిని తన పేరు మీద విరాసత్ పట్టా చేశారని తెలిపింది. అప్పటి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రైతుబంధు సాయం తన ఖాతాలో పడుతున్నాయని తెలిపింది. అయితే ఏడాదిగా అటు పీఎంకిషాన్ డబ్బులు, ఇటు రైతు బంద్ సాయం అందడం లేదని ఇదేంటని ఆరా తీస్తే అసలు నేను బ్రతికే లేనని అదికారులు చెప్తున్నారంటూ బోరుమంది. గత ఏడాది ఏప్రిల్ 11న తన కుమారుడు రాకేష్ గౌడ్ తాటి చెట్టు పైనుంచి కిందపడి మృతి చెందడంతో ఒంటరిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.
కొడుకు పేరు మీద పది గుంటలు పట్టా భూమి ఉందని.. రైతుబీమా డబ్బుల మంజూరు కోసం ఏఈవో హెప్సిబాను సంప్రదిస్తే కొడుకు మరణ దృవీకరణపత్రం, డాక్యుమెంట్లు కావాలని అడిగిందని.. కానీ తన కొడుకు చనిపోయినట్టు రికార్డ్ చేయాల్సింది పోయి.. తాను చనిపోయినట్టు రికార్ట్ ల్లోకి ఎక్కించిందని.. దీంతో తనకు రావాల్సిన ప్రభుత్వ సాయం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. రైతు బంద్ సాయం కోసం అధికారుల చుట్టూ తిరిగితే నువ్వు బతికి ఉన్నట్టు ఆధారాలు తీసుకురావాలని చెప్తున్నారని.. ఆవేద వ్యక్తంచేసింది.. తాను బతికే ఉన్నానని.. ఇంకెలా ఆధారాలు నిరూపించుకోవాలని బోరున విలపించింది. తాజాగా ఈ విషయం కలెక్టర్ దృష్టికి చేరడంతో విచారణ జరిపి పద్మకు న్యాయం చేయాలంటూ ఎంపిడివో, ఏఈవో అధికారులను కలెక్టర్ ఆదేశించినట్టు సమాచారం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
