AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amla Side Effects: డయాబెటిస్‌ రోగులు ఉసిరి తింటే ఏమవుతుందో తెలుసా? గుడ్డిగా నమ్మకండి

ఉసిరిని 'సూపర్‌ఫుడ్స్' జాబితాలో నిపుణులు చేర్చుతారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దీనిలోని మరో కోణం కూడా ఉందని ఇటీవలి తాజా అధ్యయనాలు వెల్లడించాయి. శరీరాన్ని చురుకుగా ఉంచే ఉసిరి కొంతమందికి విషంగా మారవచ్చు..

Srilakshmi C
|

Updated on: Mar 24, 2026 | 1:16 PM

Share
ఉసిరిని 'సూపర్‌ఫుడ్స్' జాబితాలో నిపుణులు చేర్చుతారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లకు నిలయమైన ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ దీనిలోని మరో కోణం కూడా ఉందని ఇటీవలి తాజా అధ్యయనాలు వెల్లడించాయి. శరీరాన్ని చురుకుగా ఉంచే ఉసిరి కొంతమందికి విషంగా మారవచ్చు.

1 / 5
ముఖ్యంగా డయాబెటిస్‌ రోగులకు ఇది చాలా ప్రమాదకరం. ఉసిరి సాధారణంగా చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇప్పటికే రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలు (హైపోగ్లైసీమియా) ఉన్నవారు ఉసిరి తీసుకోకూడదు. మధుమేహం కోసం మందులు తీసుకుంటున్న వారికి చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పడిపోయే ప్రమాదం ఉంది.

2 / 5
ఉసిరిలో పొటాషియం, ఆక్సలేట్ పుష్కలంగా ఉంటాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారికి, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉసిరి మరింత ప్రమాదకరం. ఇది ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ధోరణిని పెంచుతుంది.

3 / 5
ఉసిరి రుచికి పుల్లగా, ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. గుండెల్లో మంట లేదా జీర్ణాశయ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో ఉసిరి తినడం మంచిది కాదు. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ కడుపులో పుండ్లతో బాధపడేవారికి దీనిలోని అధిక ఆమ్లం మరింత హాని తలపెడుతుంది.

4 / 5
ఉసిరి కాలేయాన్ని శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ అల్లం లేదా మిరియాలతో కలిపి ఉసిరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్‌లపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇది కాలేయ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉసిరి తీసుకునే ముందు ఒక్కసారి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మంచిది.

5 / 5
Follow Us