AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adulterated Watermelon: మీరు కొనుగోలు చేస్తున్న పుచ్చకాయలు అసలైనవేనా? ఇంజక్షన్‌ పుచ్చకాయను ఇలా కనిపెట్టండి

ప్రస్తుతం కల్తీ సమస్య అన్ని ఆహార పదార్థాలను ప్రభావితం చేస్తోంది. వేసవిలో వచ్చే పుచ్చకాయలు సైతం కల్తీకి గురవుతున్నాయి. ఈ పండు లోపల ఎర్రగా కనిపించడానికి కొంతమంది వ్యాపారులు ఇంజెక్షన్లు వాడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కల్తీ పుచ్చకాయలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు..

Srilakshmi C
|

Updated on: Mar 24, 2026 | 1:11 PM

Share
ఈ నేపథ్యంలో, పుచ్చకాయ కొనేటప్పుడు అది సహజమైనదా? లేక కల్తీదా? దాన్ని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం. వేడి నుండి ఉపశమనం కలిగించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటంతో పాటు, ఫైబర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు కూడా దండిగా ఉంటాయి. అందువల్ల పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ పండును ఎంతో ఇష్టంగా తింటారు.

1 / 5
కొందరు వ్యాపారులు పుచ్చకాయలు త్వరగా పండటానికి లోపల ఎర్రగా కనిపించడానికి ఇంజెక్షన్లు వాడుతున్నారు. ఇలా కల్తీ చేసిన పుచ్చకాయలు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పుచ్చకాయ కొనుగోలు చేసేటప్పుడు అది సహజమైనదో లేక కల్తీదో గుర్తించడంలో మీకు సహాయపడటానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కొన్ని సులభమైన సూచనలు జారీ చేసింది.

2 / 5
మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు ముందుగా ఒక చిన్న ముక్క కోయమని అడగండి. ఆ తర్వాత కొంచెం దూది ఉండ లేదా టిష్యూ పేపర్ తీసుకుని ఆ ముక్క లోపలి భాగాన్ని మెల్లగా రుద్దండి. దూది లేదా టిష్యూ పేపర్‌ను రుద్దిన తర్వాత అది ఎర్రగా మారితే ఆ పుచ్చకాయ కల్తీ అయినట్లుగా భావించాలి.

3 / 5
పుచ్చకాయ ఎర్రగా కనిపించేలా చేయడానికి దానికి “ఎరిథ్రోసిన్” అనే రసాయనాన్ని కలుపుతారు. ఈ రసాయనం ఉన్న పుచ్చకాయను తినడం ఆరోగ్యానికి తీవ్రహానికరం. అదే టిష్యూ పేపర్ రంగు మారకపోతే, పుచ్చకాయను సహజమైనదిగా పరిగణించవచ్చు.

4 / 5
మామిడి పండ్ల మాదిరిగానే కొంతమంది వ్యాపారులు పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఈ రసాయనంతో పండించిన పుచ్చకాయలపైన పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఇలాంటి పండ్లు ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు హెచ్చరించారు. పుచ్చకాయలపై పసుపు మచ్చలు కనిపిస్తే తినే ముందు వాటిని ఉప్పు నీటితో బాగా కడగాలి. పుచ్చకాయ కొనే ముందు, దాని పైభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. పండు మీద చిన్న చిన్న రంధ్రాలు కనిపిస్తే, అలాంటి పుచ్చకాయను కొనకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ రంధ్రాలు ఇంజెక్షన్ గుర్తులు అయి ఉండవచ్చు.

5 / 5
Follow Us