ఎర్రటి దానిమ్మ గింజలని చూస్తే మనసుదోచే కెంపులే గుర్తుకొస్తాయి. దానిమ్మ గింజలే కాదు పూలు, కాయలదీ ప్రత్యేకమైన అందమే. అన్ని చోట్ల విరివిరిగా దొరికే పండ్లలో దానిమ్మ ఒకటి
TV9 Telugu
వీటి గింజల్లో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. వాస్తవానికి దానిమ్మకు సంబంధించిన వేరు, ఆకులు, పువ్వులు, బెరడు, గింజలు, అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే
TV9 Telugu
వీటిలో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా గర్భవతులకు ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ తొక్క వగరుగా ఉంటుందని తెలుసు
TV9 Telugu
అయినా దాన్ని ముక్కలుగా చేసి సలాడ్స్ రూపంలో తినండి. వగరు తగ్గడమే కాదు.. శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
ఈ పండు తొక్కలను నీటిలో వేసి మరిగించి తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలు గర్భవతిగా ఉన్న సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతుంది
TV9 Telugu
రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకోవడం వల్ల అది పుష్కలంగా లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది
TV9 Telugu
నీళ్ల విరేచనాలు అవుతోంటే.. గ్లాసు దానిమ్మ రసం లేదా ఓ కప్పు గింజలు తీసుకోండి. ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేయండి. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కొంచెం కలిపి గొంతును తాకేలా పుక్కిలించి ఊయండి. గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది
TV9 Telugu
కొబ్బరినూనెకు దీని పొడిని కలిపి వేడిచేయాలి. ఆరాక ఏదైనా సీసాలోకి వడపోయాలి. రాత్రిపూట ఈ నూనెను పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఇలా 2 సార్లు చేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం సమస్యలు ఉండవిక