AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2027: ఆరుగురు పేసర్లకు చోటు ఫిక్స్.. ఆ ప్లేయర్ కు మరోసారి హ్యాండిచ్చిన బీసీసీఐ?

ODI World Cup 2027 Team India Squad: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2026 మేనియాలో మునిగిపోయి ఉంటే, భారత సెలెక్టర్లు మాత్రం మరో అడుగు ముందుకు వేసి 'మిషన్ 2027 వరల్డ్ కప్'పై దృష్టి సారించారు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ఇప్పటికే 20 మంది కోర్ టీమ్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో ఆరుగురు ప్రధాన పేసర్లకు చోటు దక్కింది.

ODI World Cup 2027: ఆరుగురు పేసర్లకు చోటు ఫిక్స్.. ఆ ప్లేయర్ కు మరోసారి హ్యాండిచ్చిన బీసీసీఐ?
Team India
Venkata Chari
|

Updated on: Mar 24, 2026 | 1:11 PM

Share

Team India Squad: 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. అక్కడి పిచ్‌లు పేస్‌కు, బౌన్స్‌కు అనుకూలిస్తాయి. కాబట్టి, భారత సెలెక్టర్లు ఇప్పటి నుండే బలమైన బౌలింగ్ విభాగాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. పీటీఐ (PTI) నివేదికల ప్రకారం, ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను పరిశీలిస్తూనే, వరల్డ్ కప్ కోసం ప్రాథమికంగా 20 మంది ఆటగాళ్లను సెలెక్టర్లు షార్ట్ లిస్ట్ చేశారు. వీరి ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను నిరంతరం పర్యవేక్షించనున్నారు.

ఆరుగురు స్పీడ్‌స్టర్లు వీరే.. షమీకి తప్పని నిరాశ..!

సౌత్ ఆఫ్రికా పిచ్‌లపై నిప్పులు చెరిగేందుకు భారత జట్టు ఆరుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, యువ సంచలనం హర్షిత్ రాణా పేర్లు ఖరారయ్యాయి.

ఇది కూడా చదవండి: PSLను ఛీకొట్టాడు.. కట్‌చేస్తే.. రూ. 2 కోట్లతో హారతి పట్టేసిన ఐపీఎల్.. అసలెవరీ ఆల్ రౌండర్..!

ఇవి కూడా చదవండి

అయితే, గత వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసి భారత్‌ను ఫైనల్ చేర్చిన స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పేరు ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం. పెరుగుతున్న వయస్సు, ఫిట్‌నెస్ సమస్యల దృష్ట్యా ఆయనను పక్కన పెట్టినట్లు సమాచారం. ఇది షమీ అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

కోర్ టీమ్‌లో చోటు దక్కించుకున్నది వీరే..

మొత్తం 20 మంది ఆటగాళ్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్థానాలు సుస్థిరం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశం పుష్కలంగా ఉంది. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ రేసులో ఉండగా.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మలకు కూడా 20 మంది జాబితాలో చోటు దక్కే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Team India: కెప్టెన్‌గా సంజూ శాంసన్.. ఓపెనర్‌గా సూర్యవంశీ.. ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టు ఇదే..?

చివరికి ఈ 20 మంది నుంచి అత్యుత్తమ 15 మందిని ప్రధాన టోర్నీకి ఎంపిక చేస్తారు. యువ రక్తంతోపాటు అనుభవజ్ఞుల కలయికతో భారత్ ఈసారి కప్పు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us