AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌నినో ఎఫెక్ట్‌ షురూ.. తెలుగు రాష్ట్రాల్లో కరెంట్‌ కష్టాలు? విద్యుత్తు ఆదాకు చిట్కాలు..!

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడి, విద్యుత్తు సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. చలికాలంలోనూ డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు పొదుపు అత్యవసరం. ఏసీలు, ఇతర ఉపకరణాల అజాగ్రత్త వాడకం విద్యుత్తు వృథాకు కారణం. ఎల్‌ఈడీ దీపాలు, బీఎల్‌డీసీ ఫ్యాన్లు, స్టార్ రేటెడ్ ఉపకరణాలు ఉపయోగించడం, చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యుత్తు బిల్లులు తగ్గించుకొని, వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ఇది ప్రతి వినియోగదారుడి బాధ్యత.

Balaraju Goud
|

Updated on: Oct 15, 2026 | 9:28 PM

Share

1 / 7
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, వాతావరణ మార్పులు వంటి పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు రంగానికి సవాళ్లు విసురుతున్నాయి. చలికాలంలోనూ విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతుండటంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. అవసరమైనప్పుడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలు చేయడం కూడా సవాలుగా మారుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి వినియోగదారుడి బాధ్యత కూడా.

2 / 7
ఇటీవలి కాలంలో ఇళ్లలో ఏసీల వినియోగం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు ఒక ఏసీ ఉన్న ఇళ్లలో ఇప్పుడు మూడు, నాలుగు ఏసీలు లేదా సెంట్రలైజ్డ్‌ ఏసీ వ్యవస్థలు కనిపిస్తున్నాయి. దీంతో గృహ విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. ఏసీలను అవసరానికి మించి ఉపయోగించడం, ఖాళీ గదుల్లోనూ లైట్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉంచడం వంటి అలవాట్లు విద్యుత్తు వృథాకు కారణమవుతున్నాయి. ఏసీని మితమైన ఉష్ణోగ్రత వద్ద వినియోగించడం, అవసరం లేనప్పుడు ఆపేయడం ద్వారా కొంతమేర విద్యుత్తును ఆదా చేయవచ్చు.

3 / 7
విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగదారులకు సరఫరా అయ్యే క్రమంలో సాంకేతిక, పంపిణీ నష్టాలు కూడా ఉంటాయి. అందువల్ల వినియోగదారులు ఆదా చేసే ప్రతి యూనిట్‌ విద్యుత్తు మొత్తం వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. పగటిపూట సహజ కాంతిని వినియోగించడం, గది నుంచి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేయడం, అవసరం లేని ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్టాండ్‌బైలో ఉంచకుండా ఉండటం వంటి చిన్న చర్యలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి.

4 / 7
ఇళ్లలో సాధారణ బల్బులకు బదులుగా ఎల్‌ఈడీ దీపాలను ఉపయోగించడం మంచి మార్గం. సంప్రదాయ ఫ్యాన్ల స్థానంలో బీఎల్‌డీసీ ఫ్యాన్లను ఎంచుకోవడం ద్వారా కూడా విద్యుత్తు వినియోగాన్ని తగ్గించవచ్చు. ఏసీలు, ఫ్రిజ్‌లు కొనుగోలు చేసేటప్పుడు వాటి స్టార్‌ రేటింగ్‌ను పరిశీలించడం ముఖ్యం. అధిక సామర్థ్యం కలిగిన పరికరాలు ప్రారంభంలో కొంత ఎక్కువ ధరకు లభించినప్పటికీ, దీర్ఘకాలంలో విద్యుత్తు బిల్లులను తగ్గించడంలో సహాయపడతాయి. ధర తక్కువగా ఉందని నాణ్యత, విద్యుత్తు సామర్థ్యాన్ని పట్టించుకోకుండా పరికరాలను కొనుగోలు చేయకూడదు.

5 / 7
ఎల్‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందన్నది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉన్నప్పటికీ, విద్యుత్తును పొదుపుగా వినియోగించడం మాత్రం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా విద్యుత్తు బిల్లులను తగ్గించుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న విద్యుత్తు వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్తు వృథాకు అడ్డుకట్ట వేయడం ప్రతి కుటుంబం తమ బాధ్యతగా భావించాలి.

6 / 7
దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు లేదా ఎలక్ట్రీషియన్‌కు సమాచారం అందించి.. అందులోని సమస్యను సరిచేయించాలి. లేదంటే అది నేరుగా విద్యుత్ బిల్లుపై తీవ్ర ప్రభావం చూపి, వినియోగదారులకు ఊహించని రీతిలో భారీ బిల్లులు వచ్చే అవకాశముంది. కాబట్టి ఎప్పుడూ ఈ లైట్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.. అందులో ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే అప్రమత్తమై, కరెంట్ బిల్లు పెరగకుండా చూసుకోండి.

7 / 7
Follow Us