దసరాకు పాంచ్ పటాకా.. కళ్ళన్నీ ఆ ఇద్దరిపైనే..!
దసరా సందర్భంగా బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 15న రజినీకాంత్ ‘జైలర్ 2’, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’, అనుపమ పరమేశ్వరన్ ‘క్రేజీ కళ్యాణం’, విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’ విడుదల కానున్నట్లు సమాచారం. అక్టోబర్ 17న ఆనంది నటించిన ‘గరివిడి లక్ష్మి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణ ఎవరికి దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.
ఈ దసరా బరిలో కేవలం జైలర్ 2, రణబాలి మధ్యే పోటీ ఉంటుందనుకుంటే.. ఇప్పుడేకంగా 5 సినిమాలు బాక్సాఫీస్ వార్‌కు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 15, 16 తేదీల్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు రేసులో ఉన్నాయి. మరి ఈ పోటీలో ఆడియన్స్ మనసు గెలిచి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచేదెవరు..? దసరాకి ఈసారి జైలర్2, రణబాలి మధ్యే ఫైట్ ఉంటుందనుకున్నా.. రోజులు గడిచేకొద్దీ లెక్కలు మారిపోయాయి. ఒక్కో సినిమా యాడ్ అవుతూ రేసులో 5 సినిమాలు ఉన్నాయి. అక్టోబర్ 15న రజినీకాంత్’జైలర్ 2’తో వస్తుండగా.. ఆయనకు పోటీగా నెక్ట్స్ డే రణబాలితో రౌడీ బాయ్ రానున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న రణబాలిపై భారీ అంచనాలున్నాయి. పైగా సెన్సార్ టాక్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో కచ్చితంగా కమ్ బ్యాక్ ఇస్తా అంటున్నారు రౌడీ బాయ్. చూస్తుంటే విజయ్ ఈసారి రణబాలితో బాక్సాఫీస్ దగ్గర పూనకాలు పుట్టించేలా ఉన్నారు. అక్టోబర్ 16నే అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘క్రేజీ కళ్యాణం’ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ ఆంటోనీ ‘నాన్న కుట్టి’ కూడా అదే అదేరోజు రానుంది. అక్టోబర్ 17న ఆనంది నటించిన గరివిడి లక్ష్మి విడుదల కానుంది. ఒకవైపు యాక్షన్, మరోవైపు ఫ్యామిలీ సినిమాలతో ఈ దసరా అంతా కళకళలాడుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువని తెలుసా
హైదరాబాద్–విజయవాడ హైవేకు మహర్దశ! ఆరు లైన్ల పనులకు ముహూర్తం ఫిక్స్!
విమానంలో షాకింగ్ ఘటన.. ఫ్లైట్ అటెండెంట్‌ను కొరికిన నటి
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
రెస్టారెంట్ల వంటగదుల్లో నిఘా కళ్లు.. అక్కడ వండితే ఇక్కడ కస్టమర్‌కి క్లియర్‌గా కనిపించేలా..
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

