AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందంటే?

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. మొత్తం కార్పొరేషన్లలో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాల్లో బరిలోకి దిగుతుండగా, జనసేన, భారతీయ జనతా పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందంటే?
Ap Local Body Elections
Anand T
|

Updated on: Oct 15, 2026 | 10:55 PM

Share

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య మున్సిపల్ కార్పొరేషన్ల స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చింది. మొత్తం కార్పొరేషన్లలో టీడీపీ పార్టీ అత్యధిక స్థానాల్లో బరిలోకి దిగుతుండగా, జనసేన, భారతీయ జనతా పార్టీలకు కూడా ప్రాతినిధ్యం కల్పించారు. కూటమి సీట్ల సర్దుబాటు ప్రకారం: 11 మున్సిపల్ కార్పొరేషన్లలో పోటీ టీడీపీ చేయనుండగా.. 4 మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన బరిలో నిలవనుంది. ఇక 2 మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ పోటీకి సిద్ధమైంది.

పార్టీల వారీగా కేటాయించిన కార్పొరేషన్ల వివరాలు

పార్టీల వారీగా కేటాయించిన కార్పొరేషన్లను చూసుకుంటే విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇక శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లను జనసేన అభ్యర్థులు పోటీకి దిగనున్నారు. రాజమండ్రి, అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేయనుంది.

మున్సిపాలిటీల్లో కూటమి సీట్ల పంపకం

రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 106 మున్సిపాలిటీలకు కూటమి సీట్ల పంపకం ఖరారైంది. ఇందులో భాగంగా 78 మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ, 21 మున్సిపాలిటీల్లో జనసేన పార్టీ, 7 మున్సిపాలిటీల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయనున్నాయి.

టీడీపీ పోటీ చేసే మున్సిపాలిటీలు

కూటమి ఒప్పందంలో భాగంగా టీడీపీ మొత్తం 78 మున్సిపాలిటీల్లో బరిలోకి దిగుతోంది. ఇందులో ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, బొబ్బిలి, పార్వతీపురం, నర్సీపట్నం, ఏలేశ్వరం, పెద్దాపురం, రామచంద్రపురం, మండపేట, కొవ్వూరు, పాలకొల్లు, ఆకివీడు, తణుకు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీలను టీడీపీకి కేటాయించారు.

జనసేన పోటీ చేసే మున్సిపాలిటీలు

కూటమిలో జనసేనకు మొత్తం 21 మున్సిపాలిటీలు దక్కాయి. వీటిలో రాజాం, పాలకొండ, సాలూరు, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, అమలాపురం, ముమ్మిడివరం, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు మున్సిపాలిటీల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

బీజేపీ పోటీ చేసే మున్సిపాలిటీలు

బీజేపీ మొత్తం 7 మున్సిపాలిటీల్లో పోటీ చేయనుంది. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా నెల్లిమర్ల, యలమంచిలి మున్సిపాలిటీలను భారతీయ జనతా పార్టీకి కేటాయించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us