AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటలు ఎండేకాలం – గుండెలు మండేకాలం.. కరువు కోరల్లోకి తెలంగాణ..!

తెలంగాణను ఎల్‌నినో కరువు కోరల్లోకి నెట్టింది. వర్షాభావం, ప్రాజెక్టుల్లో నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. విద్యుత్ సంక్షోభం, కరెంటు కోతలు సాగును దెబ్బతీస్తున్నాయి. తాగునీటికి కూడా సమస్యలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం నీటి కోసం ప్రయత్నిస్తున్నా, రైతులు క్రాప్ హాలిడేకు సిద్ధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ తీవ్ర పరిస్థితి తెలంగాణను అతలాకుతలం చేస్తోంది. ఎగువ నుంచి నీళ్లు రావు.. ఉన్న నీళ్లను ఎత్తిపోసి నారుమళ్లను తడుపుదామంటే లిఫ్ట్ మోటార్లకు సరిపడా కరెంటు లేదు. మొత్తంగా ఇరిగేషన్ సిస్టమే బిక్కమొహమేసింది. పగవాడిక్కూడా రాకూడని కష్టం కదా ఇది? ఎల్‌నినో రక్కసి నోళ్లు తెరిచిందనడానికి ఇంతకంటే ఏం కావాలి రుజువు? తెలంగాణలో జడలు విప్పిన కరువు. ఫస్ట్ షేడ్స్‌ ఏంటి, ప్రభుత్వం ఏమంటోంది.. యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యిందా?

పంటలు ఎండేకాలం - గుండెలు మండేకాలం..  కరువు కోరల్లోకి తెలంగాణ..!
El Nino Hits Telangana Farmers
Balaraju Goud
|

Updated on: Oct 15, 2026 | 9:55 PM

Share

పంటలు ఎండేకాలం – గుండెలు మండేకాలం. నీటి కొరతలు-ఎడాపెడా కరెంటు కోతలు.. తెలంగాణ డ్రాట్ కామ్. అవును.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. కరువు కోరల్లో చిక్కుకుంది. ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రౌండ్‌లెవల్‌లో తిప్పలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. దాదాపు ఏడాదిన్నరపాటు గడ్డుకాలమే అని స్వయానా క్యాబినెట్ మంత్రులే గొంతు చించుకుంటున్నారు. యుద్ధప్రాతిపదికన అప్రమత్తమైంది ప్రభుత్వం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ముందడుగు పడింది. భారీ పంప్ మోటార్లు స్విచ్ ఆన్ చేసి తాగునీటి అవసరాల కోసం నార్లపూర్ రిజర్వాయర్‌లోకి ఆరు టీఎంసీల నీటిని విడుదల చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సోమవారం (అక్టోబర్ 12) నాగర్ కర్నూల్ జిల్లాలో అదొక పండగ వాతావరణం. బిరబిరా క్రిష్ణమ్మ పరుగులిడినట్టే అని జనం సంబరపడిపోయారు. కానీ, ఆ సెలబ్రేషన్ టైమ్స్‌ ఆ కాసేపే. తెల్లారేసరికి డామిట్ కథ అడ్డం తిరిగింది. విద్యుత్ సమస్యతో కొన్ని గంటల గ్యాప్‌లోనే మోటార్లు ఆగిపోయాయి. ఒక్కరోజులోనే ఉప్పొంగిన క్రిష్ణమ్మ.. చప్పున కిందకి ఇంకిపోయింది. కరెంట్ సమస్య తీరి, మోటార్లను మళ్లీ ఆన్ చేసినా నో యూజ్. భారీ స్థాయిలో నిరంతర సరఫరా ఉంటేనే నీటిని ఎత్తిపోసేంతటి శక్తి మోటార్లకు వచ్చేది. కానీ, గ్రిడ్ నుంచి ఆ రేంజ్‌లో విద్యుత్‌ సప్లయ్ లేదు. ఫలితం.. నీళ్లున్నా జనం దగ్గరికి చేర్చే మార్గం లేక.. చతికిలపడింది యంత్రాంగం. నిన్న అట్టహాసపు సీన్లు.. ఇప్పుడు మోటార్లు పనిచేయక ఆగిపోయిన నీళ్లు. తెలంగాణలో కరువు ఏ రేంజ్‌లో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి