తెలుగు నటి నీతీ టేలర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వెల్లడించారు. తన మొదటి తెలుగు చిత్ర దర్శకుడు రెండో అవకాశం ఇస్తానంటూ కమిట్మెంట్ అడిగాడని, ఇది తనను షాక్కు గురిచేసిందని ఆమె తెలిపారు. ఈ ఘటన తర్వాత సౌత్ సినిమాలకు దూరంగా ఉండి, టెలివిజన్ రంగంపై దృష్టి సారించినట్టు నీతీ పేర్కొన్నారు.