AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పనికిరావని పడేసిన వాటితో కోట్లు సంపాదించాడు.. అసలు మ్యాటర్ లీక్‌ అవ్వడంతో

సిక్ ఇండ్రస్ట్రీలో చోరి కలకలం రేపింది. కోట్ల రూపాయల యంత్రాలను అమ్ముకోవడంపై పోలీసులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితుడు అమెరికాకు పారిపోగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. రాజధాని పరిధిలో జరిగిన ఈ చోరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Andhra News: పనికిరావని పడేసిన వాటితో కోట్లు సంపాదించాడు.. అసలు మ్యాటర్ లీక్‌ అవ్వడంతో
Mangalagiri Sick Industry
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 24, 2026 | 1:22 PM

Share

మంగళగిరి ప్రాంతం చేనేతకు ప్రసిద్ధి.. మంగళగిరి మండలం చినకాకాని సమీపంలో 2006 లో గోలి నాగ శయన రావు అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి పదమూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని తనకా పెట్టి బ్యాంక్ లో 24.5 కోట్ల రుణం పొంది టెక్స్ టైల్ మిల్లును 2010లో ప్రారంభించారు. దీనికి మంగళగిరి టెక్స్ టైల్ ప్రవేటు కంపెనీగా నామకరణం చేశారు. అయితే కొద్దీ కాలనికే నష్టాలు రావడంతో బ్యాంక్ ఇన్ స్టాల్ మెంట్స్ చెల్లించలేకపోయారు. దీంతో దీనిని సిక్ ఇండ్రస్ట్రీగా ప్రకటించి ఈశ్వరరావు అనే వ్యక్తిని రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా నియమించారు. ఫ్యాక్టరీ చుట్టూ ప్రవేటు సెక్యూరిటీస్‌తో భద్రతను ఏర్పాటు చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న మైలవరం ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఈశ్వరరావుతో ఉన్న పరిచయం కొద్దీ సెక్యూరిటీ సిబ్బందితో చనువు పెంచుకున్నాడు. ఆ తర్వాత వారికి డబ్బు ఆశచూపి ఫ్యాక్టరీలోని యంత్రాలను కాజేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ నుండి ముఖ్యమైన యంత్రాలన్నీ విజయవాడకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాడు. వీటి అమ్మకం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇక ఎవ్వరికీ చిక్కకూడదని భావించిన అమెరికాకు చెక్కేశాడు. అయితే ప్యాక్టరీలో యంత్రాలు మాయమవ్వడంతో ఈశ్వరరావు ఫిబ్రవరిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజధాని ప్రాంతంలోని సిక్ ఇండ్రస్ట్రీ కావడంతో పాటు కోట్ల రూపాయల విలువైన యంత్రాలు చోరికీ గురికావడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా గోపాల్ అనే వ్యక్తి కొందిరితో కలిసి ఈ చోరికి పాల్పడినట్టు గుర్తించారు. చోరికి పాల్పడిన గోపాల్ అమెరికాకు పారిపోవడంతో అతనికి సహకరించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు పారిపోయిన ప్రధాన నిందితుడు గోపిన సైతం త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us