ఈ పండు గుండె జబ్బుల్ని తరిమేసే దివ్యౌషధం

24 March 2026

TV9 Telugu

TV9 Telugu

దాదాపు ప్రతి ఇంటి పెరట్లో బొప్పాయి చెట్టు ఉంటుంది. బొప్పాయి పండు, విత్తనాలు, ఆకులు ఇలా.. ఈ చెట్టులోని అన్ని భాగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

TV9 Telugu

అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజుని బొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు నిపుణులు. విటమిన్‌ ఎ, బి, సి, ఇ, కాల్షియం, ఫైబర్‌, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు... లాంటి పోషకాలెన్నో ఉంటాయి

TV9 Telugu

బొప్పాయిలో అధిక మోతాదులో ఫైబర్‌ ఉండటంవల్ల పరగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. పీచు పదార్థంవల్ల త్వరగా ఆకలి వేయదు. క్యాలరీలూ తక్కువ. కాబట్టి బరువుని తగ్గిస్తుంది

TV9 Telugu

ఉదయాన్నే తింటే శరీరంలోని మలినాల్ని బయటకు పంపి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు, దీన్లో పొటాషియం గుండె జబ్బుల్ని తగ్గిస్తే లైకోపీన్‌ చర్మానికి నిగారింపు తెస్తుంది. అందుకే రోజుని బొప్పాయితో మొదలుపెట్టండి

TV9 Telugu

పసిడి వర్ణంతో మెరిసిపోయే ఈ పండు అలసటను తగ్గించడం దగ్గరి నుంచి రోగనిరోధకతను పెంచడం వరకూ ఈ పండు ప్రత్యేకతలు ఎన్నో. దీనిలోని విటమిన్‌-సి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంతోపాటు రోగనిరోధకతను పెంచడానికి సాయపడుతుంది

TV9 Telugu

దీన్ని తరచూ తీసుకుంటే రకరకాల జబ్బుల బారిన పడకుండా ఉంటాం. ఈ పండులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, పీచు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తాయి

TV9 Telugu

బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో కెలొరీలు కూడా చాలా తక్కువ

TV9 Telugu

కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు చక్కటి ఎంపిక. దీన్ని తరచూ తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి. బొప్పాయి పండును ఆహారంలో చేర్చుకుంటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి