AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఐబీ తండా వద్ద జాతీయ రహదారి 161పై చిరుతపులి సంచారం ప్రజలను కలవరపెట్టింది. సోమవారం రాత్రి చిరుతను చూసిన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇది పంట పొలాల్లోకి పారిపోయింది. అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, మరోసారి చిరుత సంచారం తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

అల్లాదుర్గంలో చిరుత కలకలం.. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు
Leopard
P Shivteja
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 7:02 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం బెంబేలెత్తిస్తోంది.. చిరుతలు, పులులు ఆహారం కోసం నిత్యం జనావాసాల్లోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.. తాజాగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.. మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన సోమవారం రాత్రి చిరుత పులి గ్రామస్థుల కంట పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే

మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. మండలంలోని ఐబీ తండా వద్ద చిరుత పులి కనిపించింది. నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారి పక్కన సోమవారం రాత్రి సమయంలో చిరుత పరుగులు తీయడాన్ని ప్రయాణికులు గుర్తించారు. చూస్తుండగానే ఆ చిరుత జాతీయ రహదారి పక్కనున్న కంచెదూకి అటువైపుగా ఉన్న ఐబి గిరిజన తాండ వైపు పంట పొలాల్లోకి పారిపోయింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

సమాచారం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఐబి గిరిజన తాండ ను సందర్శించి గ్రామస్తులతో, రైతులతో చిరుత సంచరిస్తున్న విషయాన్ని వెల్లడించారు. పంట పొలాల్లోకి వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. మరోసారి చిరుత సంచరిస్తున్న విషయం తెలిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జాగ్రత్త.. ఇది సైలెంట్ కిల్లర్.. అలాంటి మరణాల్లో తెలంగాణ నెం.1
జాగ్రత్త.. ఇది సైలెంట్ కిల్లర్.. అలాంటి మరణాల్లో తెలంగాణ నెం.1
ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ప్రారంభం
ఆ సినిమా చూడలేక ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా..
ఆ సినిమా చూడలేక ఇంటర్వెల్‏కే దండం పెట్టి వచ్చేసా..
5 వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డు
5 వరల్డ్ కప్‌లలో గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డు
మాయమవుతున్న జానపద ఆచారం! కందికట్కూరులో కప్పతల్లి ఆట ఆడిన పిల్లలు
మాయమవుతున్న జానపద ఆచారం! కందికట్కూరులో కప్పతల్లి ఆట ఆడిన పిల్లలు
పీపీఎఫ్ ఖాతా ద్వారా ప్రతీ నెలా రూ.లక్ష పెన్షన్.. ఎలా అంటే..?
పీపీఎఫ్ ఖాతా ద్వారా ప్రతీ నెలా రూ.లక్ష పెన్షన్.. ఎలా అంటే..?
నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?
హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే
హైదరాబాద్-బెంగళూరు.. బుల్లెట్ ట్రైన్ వెళ్లేది ఈ రూట్‌లోనే
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..?
12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..?
వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ
వైభవ్ సూర్యవంశీ గొడవపై ఎట్టకేలకు నోరు విప్పిన బీసీసీఐ