Khammam: కాంగ్రెస్‌కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ : కేటీఆర్
వారంటీ గడువు తీరిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీలకు దిక్కుండదని మంత్రి కేటీఆర్ అన్నారు. చచ్చిన పీనుగులాంటిది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ చెప్తున్న ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలని కేటీఆర్ అన్నారు.కాంగ్రెస్‌ను నమ్మితే కుక్క తోకపట్టి గోదారి ఈదినట్టే అని చెప్పుకొచ్చారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంటల కరెంట్ గ్యారెంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దిగడం ఖాయమన్నారు కేటీ రామారావు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో 1324 కోట్ల రూపాయల విలువైన పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. నాడు ఎన్టీఆర్ సాధించలేకపోయినదాన్ని నేడు ఆయన శిష్యుడు కేసీఆర్ సాధ్యం చేసి చూపించబోతున్నారని కేటీఆర్ అన్నారు. తెలుగు వారి ఖ్యాతి NTR చాటితే.. తెలంగాణ వారి పౌరుషం, అస్తిత్వం..పాలనా సామర్థ్యం.. కేసీఆర్ చాటారని కేటీఆర్ వివరించారు. తనకు ఎన్టీఆర్ పేరు ఉండటం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.
సత్తుపల్లిలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సత్తుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. 150 ఏళ్ల కాంగ్రెస్‌ను ముసలి నక్కగా పోల్చారు. ఆరు దశాబ్దాలు సతాయించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆరు హామీలని చెప్తే నమ్ముతారా అని ప్రజలను ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను వేడుకుంటోందని, మరి గతంలో అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలు నమ్మొద్దని, వాళ్లు చెప్పే మాటలకు పొంతన ఉండదని, అడ్డగోలుగా ఇచ్చి హామీలు చూసి మోసపోవద్దని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆరు గ్యారెంటీలేమో కాని 3 గంటల కరెంట్, ఏడాదొక ముఖ్యమంత్రి, ఆకాశం నుంచి పాతాళం వరకు దోపిడి గ్యారెంటీ అని కేటీఆర్ తెలిపారు.
Inaugurated this beautiful Integrated Veg & Non-Veg Market in Khammam today
We are building similar such facilities across all Municipalities in Telangana pic.twitter.com/LrdPdKov8g
— KTR (@KTRBRS) September 30, 2023
రెండు టర్మ్‌ల్లో చాలా పనులు చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ చేయని పనులను KCR చేసి చూపించారన్నారు. ఇల్లు కట్టించి, పెళ్లి చేస్తున్నారు కేసీఆర్. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్స్ అమలు చేసి, పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామగా మారారని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి.




