Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్థానీ అల్లుడి అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..!

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్థానీ అల్లుడి అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..!

Anil kumar poka

|

Updated on: Sep 30, 2023 | 9:36 PM

హైదరాబాద్‌లో పాకిస్థాన్ అల్లుడి అరెస్టు కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అల్లుడి వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉందని భావించిన మామ, ఆ డబ్బు కాజేసేందుకు తానే అల్లుడిని పోలీసులకు అప్పగించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం షార్జా వెళ్లిన పాక్ యువకుడు ఫయాజ్ మహ్మద్ అక్కడి బట్టలు తయారీ కంపెనీలో పరిచయమైన హైదరాబాద్ యువతి నేహా ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు.

హైదరాబాద్‌లో పాకిస్థాన్ అల్లుడి అరెస్టు కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అల్లుడి వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉందని భావించిన మామ, ఆ డబ్బు కాజేసేందుకు తానే అల్లుడిని పోలీసులకు అప్పగించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం షార్జా వెళ్లిన పాక్ యువకుడు ఫయాజ్ మహ్మద్ అక్కడి బట్టలు తయారీ కంపెనీలో పరిచయమైన హైదరాబాద్ యువతి నేహా ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. గతేడాది నేహా హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడికొచ్చాక ఆమె ఓ బాబుకు జన్మనిచ్చింది. షార్జాలో పనిచేస్తున్న అల్లుడి వద్ద పెద్దమొత్తంలో డబ్బు ఉందని భావించిన నేహా తండ్రి జుబేష్ షేక్.. ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. భారత వీసా అయితే ఆలస్యమవుతుందని, అల్లుడికి నేపాల్ వీసా తీసుకున్నాడు. అనంతరం భార్య అఫ్జల్‌బేగం, కుమార్తె నేహా ఫాతిమాతో కలిసి నేపాల్ వెళ్లాడు. అక్కడి నుంచి నలుగురూ కలిసి నేపాల్-యూపీ సరిహద్దులోని సోనాలీ వద్ద గస్తీ సిబ్బందికి 5 వేలు ఇచ్చి భారత్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడి నుంచి రైలులో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక హైదరాబాద్‌లో అల్లుడికి ఆధార్ కార్డు సంపాదించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు జుబేష్. అప్పటి వరకు అల్లుడు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండే ఏర్పాట్లు చేశాడు. తన బావమరిది మహ్మద్ గౌస్ పేరుతో అల్లుడికి ఆధార్ కార్డు తీసుకోవాలని భావించి ఓ మీసేవ కేంద్రంలో 5 వేలు ఇచ్చి జనన ధ్రువీకరణ పత్రం తీసుకున్నాడు. అనంతరం ఆధార్‌ కార్డ్‌కోసం దరఖాస్తు చేశాడు. మరోవైపు, అల్లుడు తెచ్చిన దాదాపు 5 లక్షల డబ్బు ఖర్చు అయిపోవడంతో అతడిని వదిలించుకోవాలని జుబేష్ ప్లాన్ వేశాడు. టాస్క్ ఫోర్సు పోలీసులకు స్వయంగా సమాచారం అందించి అల్లుడిని పట్టించి, తాను భార్యతో సహా పరారయ్యాడు. ఆ తర్వాత పోలీసులు వారినికూడాఅదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..