AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్.. ఆ నేతలకూ స్ట్రాంగ్ వార్నింగ్

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో అధికారులకే పరిమితమైన కేసులో రాజకీయ నాయకుల ప్రాత ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

KTR: మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్.. ఆ నేతలకూ స్ట్రాంగ్ వార్నింగ్
BRS Working president KTR
Follow us
Balu Jajala

|

Updated on: Apr 03, 2024 | 3:45 PM

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో అధికారులకే పరిమితమైన కేసులో రాజకీయ నాయకుల ప్రాత ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు కేటీఆర్ పై ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ…అవాస్తవాలతో కూడిన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపించారు.

ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా. పదే పదే తన పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించారు. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును ప్రస్తావిస్తూ అసత్యాలు ప్రచారం చేసిన మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్ లకు మరోసారి నోటీసులు పంపించారు.

తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేదే లేదని తేల్చిచెబుతూ.. వారం రోజుల్లోగా మంత్రి కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవని కేటీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అయితే కేటీఆర్ లీగల్ నోటీసులపై కాంగ్రెస్ ఏవిధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారనుంది.

బార్లీ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్
బార్లీ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. ఇంకా బోలెడన్ని బెనిఫిట్స్
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన పొలిమేర దర్శకుడి థ్రిల్లర్ మూవీ
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన పొలిమేర దర్శకుడి థ్రిల్లర్ మూవీ
పాన్ ఇండియాలో టాలీవుడ్ రూల్.. అసలు పరీక్ష మొదలైందన్న క్రిటిక్స్‌.
పాన్ ఇండియాలో టాలీవుడ్ రూల్.. అసలు పరీక్ష మొదలైందన్న క్రిటిక్స్‌.
మన్యం గిరుల్లో పూసే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా!
మన్యం గిరుల్లో పూసే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా!
రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..
రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం..
సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్