BRS Party: పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు పెంచేలా కార్యాచరణ.. పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్ధేశం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారాన్ని సాధించింది. అయితే ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించి ప్రజల కోసం నిరంతరం పోరాడుతామంటోంది. తాజాగా గ్రేటర్ పరిధిలో ఉన్న నగర మేయర్, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగేలా పని చేయాలని దిశా నిర్ధేశం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు అధికారాన్ని సాధించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించి ప్రజల కోసం నిరంతరం పోరాడుతామంటోంది. తాజాగా గ్రేటర్ పరిధిలో ఉన్న నగర మేయర్, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు జోరు కొనసాగేలా పని చేయాలని దిశా నిర్ధేశం చేశారు. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేశాయని భావించకుండా రానున్న ఎన్నికల్లో తమ సత్తా చూపించాలన్నారు. తాము ప్రజల్లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు మేలు జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తీసుకురావాలన్నారు.
జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని, ఎప్పటిలాగే నగరవాసులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ది, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాలకపక్షంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా ప్రజల శ్రేయస్సునే బీఆర్ఎస్ కోరుకుంటుందని చెప్పారు.
ఈ మధ్య కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు 100 రోజులు సమయం ఇస్తున్నాం.. మార్చి 17తో ఈ గడువు ముగుస్తుంది. ఈలోపు ఇచ్చిన ప్రతి హామీ కార్యరూపం దాల్చాలని అసెంబ్లీలో హెచ్చరించారు. లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ఇలా అసెంబ్లీలో.. పార్టీ ఆఫీసుల్లో కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ముందుకు సాగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..