Hyderabad: టీవీ9 స్వీట్‌హోం ఎక్స్‌పోను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్లాట్, ఓపెన్ ప్లాట్, కమర్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, ఫామ్ హౌస్, విల్లా లాంటి స్థిరాస్తి కొనాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం అంటున్నారు సందర్శకులు. సొంతింటి స్వప్నం సాకారంచేసుకునేవారి అవసరాలకు అనుగుణంగాTv9 ఏర్పాటుచేసిన ఈ ఎక్స్ పో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్ ఫేమస్ అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రియల్‌ఎస్టేట్ ఇండస్ట్రీకి కాంగ్రెస్ అండగా నిలుస్తుందన్నారు. అయితే గత ప్రభుత్వం తలపెట్టిన ఫార్మాసిటీ స్థానంలో మెగాసిటీ వస్తుందన్నారు. ఇకపై ఎలాంటి పరిశ్రమ అయినా.. రీజినల్ రింగ్‌రోడ్డు అవతలే వస్తుందని.. ఐటీ కంపెనీలను మెగా సిటీలో నెలకొల్పుతామన్నారు మంత్రి.
అంతకముందు టీవీ9 స్వీట్‌హోం రియల్‌ఎస్టేట్ ఎక్స్‌పోని ప్రారంభించారు మంత్రి పొంగులేటి. ఈ ఎక్స్‌పోలో ప్రముఖ రియల్టర్లు, డెవలపర్లు, పలు సంస్థలు పాల్గొన్నాయి. ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు కొనేవారికి టీవీ9 అద్భుత అవకాశం కల్పిస్తోంది. తమ బడ్జెట్‌కు తగ్గట్లుగా వివిధ సంస్థలు వెంచర్లను, ప్లాట్లు, ఫ్లాట్లను అందుబాటులో ఉంచాయి. సామాన్యులు, వినియోగదారులు ఎక్స్‌పోలో పాల్గొని తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాల్సిందిగా టీవీ9 విజ్ఙప్తి చేస్తోంది. మాదాపూర్‌లోని మేదాన్ ఎక్స్‌పో సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. ఇవాళ, రేపు, ఎల్లుడి జరిగే ఎక్స్‌పోను సద్వినియోగం చేసుకోండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.