Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. వారి పెండింగ్ చలాన్లపై 80% డిస్కౌంట్.. వివరాలివే..
తెలంగాణలో వాహనదారులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టూవీలర్స్‌కి 80%, ఫోర్‌వీలర్స్, ఆటోలు, కార్లు (LMV) కు 60% డిస్కౌంట్ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర హెవీవెహికిల్స్‌కి 60% తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. RTC బస్సులకు 90% మినహాయింపును ఇచ్చారు.
తెలంగాణలో వాహనదారులకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టూవీలర్స్‌కి 80%, ఫోర్‌వీలర్స్, ఆటోలు, కార్లు (LMV) కు 60% డిస్కౌంట్ ప్రకటించింది. లారీలతో పాటు ఇతర హెవీవెహికిల్స్‌కి 60% తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. RTC బస్సులకు 90% మినహాయింపును ఇచ్చారు. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్‌తో చలానాల చెల్లింపునకు అవకాశం ఇచ్చింది. గతంలో ఇచ్చిన దానికంటే.. పోలీసులు ఎక్కువ డిస్కౌంట్ ప్రకటించారు. ఆన్లైన్ తో పాటు, మీసేవ సెంటర్స్ లో డిస్కౌంట్ లో చలాన్స్ పేమెంట్ చేయవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లపై డిస్కౌంట్లను ఆమోదించినట్లు తెలిపింది. ఈ తగ్గింపులను డిసెంబర్ 30 (శనివారం)న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో నిర్వహించే మెగా జాతీయ లోక్ అదాలత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను కలిగి ఉన్న వ్యక్తులు 26/12/23 నుంచి E చలాన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వాటిని క్లియర్ చేయవచ్చు. 10/01/24 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ అమల్లో ఉంటుంది. 2022 లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలయ్యాయి. ఆ తర్వాత జనరేట్ అయిన చలాన్లకు సరిగా డబ్బులు వసూలు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.
మీ వాహనంపై ఎంత చలాన్ ఉందో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి..
తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు పదేపదే చెప్పినా.. వాహనదారులు పట్టించుకోవడవం లేదు.. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్ టెకింగ్, రాంగ్ రూట్‌లో వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఆయా వాహనాల ఓనర్ల పేరుపై ట్రాఫిక్ చలాన్లు పెరిగిపోతున్నాయి. చలాన్లు పడుతున్నా వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..