KTR: హీరోయిన్లను బెదిరించానంటున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం.. తాట తీస్తాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల సీజన్‌ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు ఫోన్‌ ట్యాపింగ్‌, మరోవైపు గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఆపరేషన్‌ ఆకర్ష్‌, ఇవిగాకుండా కరువు పరిస్థితులు.. ఇవన్నీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలపై కొన్నిరోజులుగా సాగుతున్న ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి..

KTR: హీరోయిన్లను బెదిరించానంటున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం.. తాట తీస్తాం: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR Revanth Reddy
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:01 PM

అసెంబ్లీ ఎన్నికల సీజన్‌ను మించిన రాజకీయ యుద్ధం తెలంగాణలో ఇప్పుడు నడుస్తోంది. ఒకవైపు ఫోన్‌ ట్యాపింగ్‌, మరోవైపు గేట్లు ఎత్తేస్తున్నామంటూ ఆపరేషన్‌ ఆకర్ష్‌, ఇవిగాకుండా కరువు పరిస్థితులు.. ఇవన్నీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ మూడు అంశాలపై కొన్నిరోజులుగా సాగుతున్న ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి.. బుధవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్ నుంచి, ఆపరేషన్ ఆకర్ష్.. కరువు పరిస్థితులపై మాట్లాడారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. తనకు ఇల్లీగల్‌ విషయాలతో సంబంధం లేదన్నారు. రేవంత్ లీకు వీరుడు.. అని.. తాను ట్యాపింగ్‌ చేయలేదంటూ స్పష్టంచేశారు. ఏదైనా ఉంటే లీగల్‌గా పోరాడుతామని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2004 నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. రేవంత్‌ దీనిపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘‘ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అనే ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ట్యాపింగ్ వ్యవహారానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఇలాగే ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టము. తాట తీస్తాం.. నేను భయపడను..’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

గేట్లు ఎత్తడం కాదు.. ప్రాజెక్టు గేట్లు ఎత్తండి.. అంటూ కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ట్యాపింగ్‌ కాదు..వాటర్‌ ట్యాప్‌లపై దృష్టి పెట్టాలన్నారు. సీఎం రేవంత్‌కు నీటి కేటాయింపుపై శ్రద్ద లేదంటూ పేర్కొన్నారు. ఇది ప్రకృతి ద్వారా వచ్చిన కరువు కాదంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సృష్టించిన కృత్రిమ కొరత అంటూ వ్యాఖ్యానించారు. ప్రాజెక్ట్‌ల్లో నీళ్లున్నా ఉపయోగించుకునే తెలివిలేదన్నారు. రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడంలేదన్నారు. కాళేశ్వరంను స్కామ్‌గా చూపెట్టాలని చూశారంటూ కేటీఆర్‌ విమర్శించారు.

కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ పోస్టులు త్వరలో ఊడటం ఖాయమంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. అక్కడ ఉప ఎన్నికలు రావడం ఖాయమని.. ఈ ఆదివారం లోపు స్పీకర్‌ తేల్చలేకపోతే కోర్టుకు వెళ్తామంటూ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉందని.. ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచి, మళ్ళీ వేరే పార్టీలో పోటీ చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మందకృష్ణ మాదిగ ఇదే విషయం మాట్లాడారంటూ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వివరాలు అన్ని రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు.

కాంగ్రెస్ కు హైదరాబాద్ ఓటు వేయదు, అది అందరికీ తెలుసు, అందుకే హైదరాబాద్ లో ప్రజలపై కక్ష కట్టారా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నీళ్ల ట్యాంకర్ పంపుతున్న మమ్మల్ని మెచ్చుకోరా అంటున్నారు.. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలా ఇవి.. అంటూ ప్రశ్నించారు. బుక్ చేసిన వారానికి నీళ్ల ట్యాంకర్లు వస్తున్నాయి.. మీకు నిజాయితీ ఉంటే ఫ్రీ గా నీళ్ల ట్యాంకర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?