Telangana: సంకెళ్లు వేయాల్సిన ఆ చేతులకే బేడీలు.. జైల్‌లో సీన్ రివర్స్.. కట్ చేస్తే!

అధికారం.. అధినేత అండదండలు ఉన్నాయి కదా అని అడ్డదారిలో వెళ్లారు. అవినీతి కేసులో అడ్డంగా బుక్కై జైలు పాలయ్యారు. తప్పు చేసిన వాడి తాటా తీయాల్సిన ఆ చేతులు ఇప్పుడు ఊచలు లెక్కించే పరిస్థితి ఏదురైంది. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన ఆ అధికారులు జైల్లో ఎలా ఉంటున్నారో తెలుసా.. అందరిలానే జైలు జీవితం గడపాల్సిందేనా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Telangana: సంకెళ్లు వేయాల్సిన ఆ చేతులకే బేడీలు.. జైల్‌లో సీన్ రివర్స్.. కట్ చేస్తే!
Phone Tapping Case
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 03, 2024 | 12:04 PM

నేరస్తులకు సంకెళ్లు వేయాల్సిన ఆ చేతులకే బేడీలు పడ్డాయి..! అధికారం.. అధినేత అండదండలు ఉన్నాయి కదా అని అడ్డదారిలో వెళ్లారు. అవినీతి కేసులో అడ్డంగా బుక్కై జైలు పాలయ్యారు. తప్పు చేసిన వాడి తాటా తీయాల్సిన ఆ చేతులు ఇప్పుడు ఊచలు లెక్కించే పరిస్థితి ఏదురైంది. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన ఆ అధికారులు జైల్లో ఎలా ఉంటున్నారో తెలుసా.. అందరిలానే జైలు జీవితం గడపాల్సిందేనా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

స్కాములు చేసి జైలుపాలైన పోలీస్ బాసులు జైల్లో ఏం చేస్తున్నారు. నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నారా..? సాధారణ ఖైదీలతోనే వీరిని కూడా బ్యారెక్‌లో పెడతారా..;? భోజనం అందరితో పాటే క్యూలో నిలబడి తీసుకోవల్సిందేనా..?. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వీరికి జైల్ అధికారులు ఏమైనా పని చెబుతారా..? లేదంటే అరెస్టు అయిన అందరూ ఒక చోట చేరి కబుర్లు చెబుతారా..? ఇవే ఇప్పుడు ఎక్కుడ చూసినా వినడపే మాటలు. జరిగే చర్చలు. కాని అరెస్టై జైల్లో ఉన్న పోలీసు అధికారులకు లైఫ్ స్టయిల్ మరోలా ఉంటుంది. వారిని హై సెక్యూరిటీ ఉన్న బ్యారెక్ లో పెట్టి వారి కదలికలపై గట్టి నిఘా పెడతారు. బ్యారెక్ దాని చూట్టుపక్కల 24గంటల పాటు సిబ్బంది ఉండటమే కాదు, సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తుంటారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణిత్ రావు, అలాగే సస్పెండ్ అయి జైలులో ఉన్న మాజీ డిఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రస్తుతం చంచల్ గూడా జైలులో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. పోలీసుల కస్టడీ పూరైన తరువాత వీరు మళ్లీ రావాల్సింది కూడా చంచల్ గూడ జైలుకే. అయితే జైల్ అధికారులు వీరికి హై సెక్యూరిటీ ఉన్న బ్యారెక్‌లను కేటాయించారు. గతంలో డ్యూటీలో ఉన్నప్పుడు వీరు అనేక మంది నేరస్తులను అరెస్టు చేసి జైలుకి పంపారు. వీరిలో కొంత మంది బెయిల్‌పై బయట ఉండగా, మరికొంత మంది జైలులోనే ఉన్నారు. ఎక్కువ శాతం చంచల్ గూడ, చర్లపల్లి జైలులో ఉన్నారు.

అయితే అధికారులు అరెస్టు అయి జైలుకు వస్తే పాత నేరస్తులు.. అంటే వారు జైలుకి పంపిన నేరస్తులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అలా దాడి జరిగితే దానికి జైలు అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇబ్బందులు సైతం ఎదుర్కొవాల్సి వస్తుంది. అందుకే సాధారణ ఖైదీలు బ్యారెక్ లు కాకుండా ప్రత్యేక బ్యారెక్‌లో పెడతారు. అది కూడా హై సెక్యూరిటీ ఉన్న బ్యారెక్స్. ఇతర ఖైదీలు వారిని కలుసుకోవడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. జైలులో బయటకు.. లోపలికి వెళ్లే దారి ఒకటై అయిన బ్యారెక్స్ మాత్రం వేరు వేరు.

ఇక భోజనం విషయంలో కూడా అందరూ ఖైదీల తరహాలో క్యూలో నిలబడకుండా వారికి భోజనం అందిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ఆరోగ్యం, సెక్యూరిటీ విషయంలో ఇతర ఖైదీల కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని జైలు అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా గులాబీ బాస్ కోసం దండుకట్టి.. ఆయన గెలుపుకోసం అడ్డదారిలో పని చేసిన పోలీస్ అధికారులు అంతా ఇప్పుడు జైలుపాలవుతున్నారు. నేరస్తులకే సంకెళ్లు వేయాల్సిన ఆ చేతులకు బేడీలు పడి ఊచలు లెక్కించే పరిస్థితి ఏర్పడింది. చేసేది తప్పు అని తెలిసి మరీ అధినేత ఆర్డర్స్ తో చాలా మంది పోలీస్ బాసులు ఇబ్బందిలో పడ్డారనే చెప్పాలి..! ఈ కేసులో ఇంకా ఏంతమందికి చంచల్‌గూడ జైలు యోగం ఉందో చూడాలి మరి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…