Telangana: ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నారా.. ఈ టెస్ట్‌తో ఎన్ని రోజులైనా దొరికిపోతారు.. షాక్ ఇస్తున్న పోలీసులు

ర్యాడిసన్ డ్రగ్ కేసులో పోలీసులు మరోసారి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. పోలీసులు చేపట్టిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఇన్వెస్టిగేషన్‌కు ఆటంకం ఏర్పడింది. అందుకే పోలీసులు మరో రూట్ ఎంచుకున్నారు. నిందితులకు క్రోమోటోగ్రఫి చేయాలని డిసైడ్ అయ్యింది.

Telangana: ఒక్కసారి డ్రగ్స్ తీసుకున్నారా.. ఈ టెస్ట్‌తో ఎన్ని రోజులైనా దొరికిపోతారు.. షాక్ ఇస్తున్న పోలీసులు
Drug Detection Tests
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 03, 2024 | 12:30 PM

ర్యాడిసన్ డ్రగ్ కేసులో పోలీసులు మరోసారి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులు తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. పోలీసులు చేపట్టిన పరీక్షల్లో నెగటివ్ రావడంతో ఇన్వెస్టిగేషన్‌కు ఆటంకం ఏర్పడింది. అందుకే పోలీసులు మరో రూట్ ఎంచుకున్నారు. నిందితులకు క్రోమోటోగ్రఫి చేయాలని డిసైడ్ అయ్యింది.

సంచలనం సృష్టించిన ర్యాడిన్ డ్రగ్ కేసులో సైబరాబాద్ పోలీసులు మరోసారి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రీటీలు అందురు దాదాపు తప్పించుకున్నట్లే. కేసు నమోదైన తరువాత పట్టుబడిన 14 మందిలో ముగ్గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా ఆరోపణలు ఎదురుక్కొన్న సెలబ్రీటలకు అందరికి నెగటివ్ రిపోర్ట్ నమోదైంది. అయితే వీరంతా కేసు నమోదు కావడంతో పరారీలో ఉండి వారం రోజుల తరువాత పోలీసుల ఎదుట హాజరు కావడమే నెగటివ్ కి కారణమని తెలుస్తోంది.

పక్కా ప్లాన్ వేసిన సెలబ్రీటీలు డైరెక్టర్ క్రిష్, చరణ్, సందీప్ నీల్, నటి లిషి , శ్వేతలు వారం, పదిరోజుల తరువాత విచారణకు హాజరయ్యారు. వీరి నుండి రక్త, మూత్ర, వెంట్రకల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపిన పోలీసులకు చేధు అనుభవం ఎదురైంది. రోజులు గడిచిపోవడంతో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కడ ఆనవాళ్లు దొరకలేదు. అంటే నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఈ కేసులో వారిని నిందితులుగా పరిగణించడం కష్టం అయిపోయింది.

అందుకే సైబరాబాద్ కమిషనరేట్ లోని గచ్చిబౌలి పోలీసులు మరో ప్లాన్ రెడీ చేశారు. నిందితులు అందరికి అందులో నెగటివ్ వచ్చిన వారిని మరోసారి విచారణకు పిలిచి క్రోమోటోగ్రఫీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ టెస్ట్ సాదా సీదా టెస్ట్ మాత్రం కాదు. ఇది చేయాలంటే కోర్టు నుండి అనుమతి కావాలి. అందుకే మొదట కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ అనుమతి రాకపోవడంతో హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్లాన్స్ పిటిషన్ లో తెలియజేశారు.

క్రోమోటో గ్రఫీ అంటే ఏమిటి..?

అసలు క్రోమోటోగ్రఫీ అంటే మిశ్రమాలను విభజించు ప్రక్రియ. ఏదైనా మిశ్రమంలో మరో రసాయనం కలిస్తే దాన్ని తెలుసుకునేందుకు ఇథనాల్ రసాయనాలతో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. సూక్ష్మమిశ్రమాన్ని కూడా ఈ క్రోమోటోగ్రఫీ ఇట్టే పసిగట్టేస్తుంది. ఒక కెమికల్‌లో మరో కెమికల్ రవ్వంత కలిసినా క్రోమోటోగ్రఫిలో ఉపయోగించే పేపర్ గ్రీన్ కలర్‌గా మారుతుంది. అంటే అందులో మరో రసాయనం కలిసింది అని నిర్థరాణకు వస్తారు. ఇప్పుడు ఇదే ర్యాడిసన్ డ్రగ్స్ నిందితులపై ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో ఇది రష్యన్ లో ఎక్కువగా వాడుకలో ఉండేది. రాను రాను మన దగ్గర కూడ వీటి ఉపయోగాలు అనేక ఫలితాలు ఇచ్చాయి

ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతి ఇస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందరిని పిలిచి మరోసారి వారి నుండి రక్త నమూనాలు సేకరిస్తారు. క్రోమోటోగ్రఫి ద్వారా వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా సుక్ష్మంలో ఉన్న ఇట్టే మిశ్రమం కలిసి కాగితం రంగుమారిపోతుంది. దాని ద్వారా వారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అవుతుంది. డ్రగ్స్ తీసుకున్న వారు నెలలు, సంవత్సరాలు గడిచిన దీని ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. సో ఈ విధానంతోనే ర్యాడిసన్ డ్రగ్స్ ముఠాకు చెక్ పెట్టాలని గచ్చిబౌలి పోలీసులు రెడీ అయ్యారు.

అయితే ఇది నేర విభాగంలో ఉపయోగించినా కోర్టు నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి. సదరు వ్యక్తి తన రక్త నమూనాలు ఇవ్వడానికి ఇష్టపడడు. కోర్టు అనుమతి ఉంటే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే.. అందుకే మన పోలీసులు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కోర్టు ఒకే చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రయోగం మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇక ర్యాడిసన్ కేసులో తప్పించుకున్న వారు అందరూ ఊచలు లెక్కించాల్సిందే..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..