KTR Gift: టీఆర్‌ఎస్ కార్యకర్త కూతురుకు సర్‌ప్రైజ్ కాల్ చేసిన కేటీఆర్..చిన్నారి అడిగిన గిఫ్ట్‌కు ఫిదా అయిన మంత్రి
KTR Gift: ఓవైపు రాజకీయాలతో పాటు మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నేతల్లో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఒకరు. కేవలం రాజకీయాలే కాకుండా ఇతర అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో..
KTR Gift: ఓవైపు రాజకీయాలతో పాటు మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నేతల్లో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఒకరు. కేవలం రాజకీయాలే కాకుండా ఇతర అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు కేటీఆర్. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన వీడియోలు అడపాదడపా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నవాజ్ హుస్సేస్ అనే కార్యకర్త గత 20 రోజులుగా ఎమ్మెల్సే ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పార్టీలో చురుకుగా ఉండే నవాజ్ హుస్సేన్ తన వ్యక్తిగత పనులను సైతం పక్కన పెట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే నవాజ్ హుస్సేన్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అతని మామ చనిపోయాడు. కానీ పార్టీ పనుల్లో బిజీగా ఉండడంతో అంత్యక్రియలకు కూడా హాజరుకాలేడు. తాజాగా శనివారం ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ నవాజ్‌ను పిలిపించుకొని మాట్లాడారు. ఈ సందర్భంగా శనివారం తన కూతురు పుట్టిన రోజు అని నవాజ్ కేటీఆర్‌కు చెప్పాడు. దాంతో వెంటనే ఆ పాపకు ఫోన్ చేసిన కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు కరీంనగర్‌లో ఉన్న పార్టీ కార్యకర్తలతో ఓ బహుమతిని కూడా పంపించాడు. ఇక కేటీఆర్‌తో ఆ చిన్నారి ఫోన్‌లో మాట్లాడిన తీరుకు మంత్రి ఫిదా అయ్యారు. ఇంతకీ మంత్రి ఆ చిన్నారితో ఏం మాట్లాడంటే.. నవాజ్ కూతురుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్, ఆ చిన్నారి ఎక్కడ చదువుతోంది లాంటి విషయాలు తెలుసుకొని చివరిగా పుట్టిన రోజున ఏం బహుమతి కావాలి అని అడిగారు.. దానికి స్పందించిన ఆ చిన్నారి ఎలాంటి బహుమతి వద్దు అని సమాధానం ఇచ్చింది. అయితే కేటీఆర్ మరోసారి అడగడంతో ‘తెలంగాణ’ గెలిస్తే చాలు అదే నాకు బహుమతి అని సమాధానం ఇచ్చింది. దీంతో కేటీఆర్ ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్.. నవ్వుతూ వారెవ్వా అని ఆ పాపకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ వచ్చిన వెంటనే చిన్నారిని కలుస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.