Hyderabad Cyber Crime: అడ్డంగా బుక్కైన యువతి.. ఒక్క ఫోన్‌కాల్‌తో రూ. 6 లక్షలు గయాబ్.. అసలేం జరిగిందంటే..
Hyderabad Cyber Crime: హైదరాబాద్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఒక్క ఫోన్‌కాల్‌తో ఓ యువతి అకౌంట్ నుంచి ఏకంగా..
Hyderabad Cyber Crime: హైదరాబాద్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఒక్క ఫోన్‌కాల్‌తో ఓ యువతి అకౌంట్ నుంచి ఏకంగా రూ. 6 లక్షలకు పైగా కొట్టేశారు. తీరా జరిగిన మోసాన్ని గుర్తించిన యువతి.. బోరుమంటూ పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందని ఓ యువతికి సైబర్ నేరగాళ్లు ఓ సందేశం పంపించారు. అదేంటంటే.. మరో 24 గంటల్లో మీ ఫోన్ నెట్‌వర్క్ బ్లాక్ అవబోతోందని, ఇకపై మీ ఫోన్ పనిచేయదని మెసేజ్ పంపిచారు. ముందుగా ఆ మెసేజ్ చూసిన యువతి లైట్ తీసుకుంది.
కానీ, మెసేజ్ వచ్చిన కాసేపటిలో ఫోన్ కాల్ కూడా వచ్చింది. కస్టమర్ కేర్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మాట్లాడిన ఓ వ్యక్తి.. మీ ఫోన్ నెట్‌వర్క్ బ్లాక్ కాబోతోందంటూ యువతికి నమ్మబలికాడు. ఇలా చేస్తే మీ ఫోన్ మళ్లీ యధావిధిగా పని చేస్తుందంటూ ఊదరగొట్టాడు. ఫోన్‌లో అతను చెప్పినవన్నీ నిజమని నమ్మిన యువతి.. వారు చెప్పినట్లుగా చేసింది. ఇంకేముంది మంచితరుణం మించినా దొరకదన్నట్లుగా.. సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఆమె ఫోన్‌ను వారి కంట్రోల్‌లోకి తీసుకుని వారికి అవసరమైన సెట్టింగ్స్‌ను వారు చేసేసుకున్నారు. అనంతరం సక్సెస్‌ఫుల్‌గా పని కంప్లీట్ అని, మీకు ఇక ఎలాంటి అవాంతరం లేకుండా పని చేస్తుందంటూ యువతికి చెప్పాడు.
అయితే, ఇప్పుడే ఇక అసలు కథ మొదలైంది. ఫోన్ బాగైందని చెప్పిన కేటుగాడు.. చెకింగ్ పేరుతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలిసిన వాళ్లకు కొంత మొత్తం డబ్బులు పంపించమని సూచించారు. అలా చేయడం ద్వారా ఫోన్ నెట్‌వర్క్ సక్రమంగా పని చేస్తుందా? లేదా? అనేది స్పష్టమవుతుందని చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మిన యువతి.. తనకు పరిచయం ఉన్న వారికి కొంత డబ్బును ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ కొట్టింది. అప్పటికే ఫోన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆమె ట్రాన్సక్షన్ వివరాలను పసిగట్టారు. ఇక అంతా బాగుంది కదా అనుకుని అటువైపు కస్టమర్ కేర్ పేరుతో ఆ కేటు గాళ్లు ఫోన్ కట్ చేయగా.. యువతి కూడా హమ్మయ్య అనుకుని కుదిటపడింది.
కానీ, కేటుగాళ్లు తమ పనిని అప్పుడే మొదలు పెట్టారు. అప్పటికే యువతి ఆన్‌లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను తెలుసుకున్న మాయగాళ్లు.. దాని ఆధారంగా డబ్బులు కాజేశారు. మొత్తం మూడు విడతలుగా రూ. 6.40 లక్షలు కాజేశారు. ఇది గమనించిన యువతి.. జరిగిన మోసాన్ని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also read: