AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Train Terminal: ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న రైల్వే స్టేషన్‌.. వైరల్‌గా మారిన తొలి ఏసీ రైల్వే టర్మినల్‌ ఫొటోలు..

India's First AC Train Terminal: ఆ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెడితే విమానాశ్రయంలోకి వెళ్లామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎక్కడ చూసినా మిరిమిట్లు గొలిపే లైటింగ్స్‌, పూర్తిగా ఏసీ ఇలా అచ్చంగా ఎయిర్‌ పోర్ట్‌లోనే ఉన్నామా.. అన్న ఫీలింగ్‌ కలగకమానదు. అదే..

AC Train Terminal: ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న  రైల్వే స్టేషన్‌.. వైరల్‌గా మారిన తొలి ఏసీ రైల్వే టర్మినల్‌ ఫొటోలు..
First Ac Train Terminal
Narender Vaitla
|

Updated on: Mar 13, 2021 | 6:40 PM

Share

India’s First AC Train Terminal: ఆ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెడితే విమానాశ్రయంలోకి వెళ్లామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఎక్కడ చూసినా మిరిమిట్లు గొలిపే లైటింగ్స్‌, పూర్తిగా ఏసీ ఇలా అచ్చంగా ఎయిర్‌ పోర్ట్‌లోనే ఉన్నామా.. అన్న ఫీలింగ్‌ కలగకమానదు. అదే బెంగళూరులో తాజాగా నిర్మించిన రైల్వే టర్మినల్‌. భారత దేశానికి చెందిన ప్రఖ్యాత సివిల్‌ ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీదుగా నిర్మాణం ప్రారంభించిన ఈ రైల్వే టర్నినల్‌ నిర్మాణ పనులు పూర్తి కావొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని కేంద్రం రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శనివారం ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. రైల్వే టర్మినల్‌కు సంబంధించిన ఫొటోలను మంత్రి పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే సుమారు రూ314 కోట్లతో నిర్మించిన ఈ టర్మినల్‌ దేశంలో తొలి సెంట్రలైజ్డ్‌ ఏసీ రైల్వే టర్మినల్‌గా పేరుగాంచింది. బెంగళూరులోని బయ్యప్పన్‌ హళ్లిలో 4,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టర్మినల్‌ ద్వారా రోజు 50 వేల మంది రాకపోకలు సాగించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ టర్మినల్‌లో ఏకంగా 250 కార్లు, 800 బైక్‌లు పార్కింగ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే నిజానికి ఈ టర్మినల్‌ గత ఫిబ్రవరి నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

Also Read: మమతా ముఖర్జీకి తగిలిన గాయం’యాక్సిడెంటల్’, ఈసీకి ప్రత్యేక పరిశీలకుల నివేదిక

నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా ఝార్ఖండ్‌ పోలీసుల వినూత్న కార్యక్రమం.. లొంగిపోయేందుకు ఆసక్తి

Honeymoon: పెళ్లై ఐదు నెలలు అయినా శోభనానికి అంగీకరించని భార్య.. ఏంటా అని ఆరాతీసిన భర్తకు ఫ్యూజుల్ ఔట్..!