మమతా ముఖర్జీకి తగిలిన గాయం’యాక్సిడెంటల్’, ఈసీకి ప్రత్యేక పరిశీలకుల నివేదిక
బెంగాల్ సీఎం మమతా ముఖర్జీకి తగిలిన గాయం యాక్సిడెంటల్ అని, ఆమెపై దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని ప్రత్యేక పరిశీలకులు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేశారు.
బెంగాల్ సీఎం మమతా ముఖర్జీకి తగిలిన గాయం యాక్సిడెంటల్ అని, ఆమెపై దాడి జరిగిందనడానికి ఆధారాలు లేవని ప్రత్యేక పరిశీలకులు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేశారు. వివేక్ దూబే, అజయ్ నాయక్ అనే అబ్జర్వర్లు తమ నివేదికలో ఈ విషయాన్ని తెలియజేస్తూ… ఈ నెల 10 న నందిగ్రామ్ లో మమత తన కారు ఎక్కబోతుండగా ఆ వాహన డోర్ విసురుగా ఆమె కాలికి తగిలిందని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉన్నారని వీరు తెలిపారు. ఈ విషయంలో మమత పై ఎటాక్ జరిగినట్టుగా బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయ మొదట ఇచ్చిన నివేదికపట్ల ఈసీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ కారణంగానే ప్రత్యేక పరిశీలకులకు ఈ బాధ్యత అప్పగించింది. వీరు నందిగ్రామ్ లో స్పాట్ కు వెళ్లి అక్కడి పరిస్థితులను మదింపు చేసుకున్నారు. మమతపై ఎటాక్ జరిగిన ఆనవాళ్లు గానీ, సూచనలు గానీ లేవని వేరు నిర్ధారణకు వచ్చారు.
అసలు మమత ఎక్కబోయిన కారు డోర్ విసురుగా ఆమె కాలికి ఎలా తగిలిందన్నదానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదికలో కూడా లేదని, అయితే ర్యాలీ సందర్భంగా ఆమె హడావుడిగా తన వాహనం ఎక్కబోతున్నప్పుడు ఆ వాహనం డోర్ విసురుగా తగిలిందని పరిశీలకులు పేర్కొన్నారు. నందిగ్రామ్ లో ప్రత్యక్ష సాక్షుల నుంచి కూడా వీరు వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాతే వీరు తమ రిపోర్టును ఈసీకి సమర్పించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అందజేసిన నివేదిక అసంబద్ధంగా, అసమగ్రంగా ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ఏమైనా ఈ ఘటన అంతా రాజకీయ కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని బీజేపీ నేతలు కూడా ఈసీని కలిసి ఓ మెమోరాండం సమర్పించారు. అటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు దీదీ కూడా ఓ వీడియో సందేశమిస్తూ… తనపై దాడి జరిగినట్టు ఎక్కడా ప్రస్తావించలేదు.
మరిన్ని చదవండి ఇక్కడ :
KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య ( వీడియో )
Megastar Chiranjeevi: మన్మధుడు నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి… వీడియో