నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా ఝార్ఖండ్‌ పోలీసుల వినూత్న కార్యక్రమం.. లొంగిపోయేందుకు ఆసక్తి

నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిసేలా చేసేందుకు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెడుతోంది. తామంతట వచ్చి లొంగిపోయిన నక్సలైట్లలో కొందరికి శిక్ష లేకుండా ..

నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసేలా ఝార్ఖండ్‌ పోలీసుల వినూత్న కార్యక్రమం.. లొంగిపోయేందుకు ఆసక్తి
Follow us

|

Updated on: Mar 13, 2021 | 5:27 PM

నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిసేలా చేసేందుకు పోలీసు శాఖ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రవేశపెడుతోంది. తామంతట వచ్చి లొంగిపోయిన నక్సలైట్లలో కొందరికి శిక్ష లేకుండా చేయడంతో పాటు వారికి ఆర్థిక సాయం కోసం కొంత డబ్బును సైతం అందించడం మనం గతంలో చూసే ఉంటాము. తాజాగా ఝార్ఖండ్‌ ప్రభుత్వం కొన్నేళ్లుగా నక్సల్స్‌ వ్యతిరేకంగా క్యాంపెయిన్‌ ప్రారంభించింది. దీని వల్ల నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేయడం లేదా వారే పోలీసులకు లొంగిపోవడం చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి లొంగిపోయేందుకు ఆసక్తి చూపే నక్సల్స్‌ సంఖ్య పెరుగూ వస్తోంది. సాధారణ స్థాయిలో ఉన్నవారే కాదు.. రివార్డు ప్రకటించిన మావోయిస్టులు కూడా చాలా మంది పోలీసుల ముందు లొంగిపోతున్నారు. తాజాగా రఘువంశ్‌ గంజు అనే మావోయిస్టు నేత పోలీసుల ముందు లొంగిపోయాడు. అతడిపై గతంలో పది లక్షల రూపాయల రివార్డు సైతం ప్రకటించారు పోలీసులు.

గత ఐదేళ్ల నుంచి లొంగిపోయే ఈ నక్సలైట్లందరూ తృతీయ ప్రస్తుతి కమిటీ (టీపీపీ) కి చెందిన వారే కావడం గమనార్హం. ఈ సంస్థ 90 ఏళ్లల్లో మావోయిస్టు వ్యతిరేక కార్యక్రమాల్లో భద్రతా దళాలకు తోడుగా నిలిచింది. నక్సల్స్‌ సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండటం, మావోయిస్టుల గ్రూపు సభ్యుల మెరుగైన జీవితం కోసం వారు లొంగిపోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో వీరంతా ప్రభుత్వాధికారులను సంప్రదించేందుకు వెనుకాడేవారు. వారికి దూరంగా ఉండేందుకే ప్రయత్నించేవారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కాగా, ఝార్ఖండ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా భద్రతా దళాల వారు ప్రారంభించిన యాంటీ నక్సల్స్‌ క్యాంపెయిన్‌ మంచి ఫలితాలను అందిస్తోంది. ఛత్రా ప్రాంతంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ 190 బెటాలియన్‌ అటవీ లోపలికి కూడా చేరుకుంటోంది. స్థానిక పోలీసుల సాయంతో అటవీ ప్రాంతాల్లోకి వెళ్లి చర్చలు జరుపుతోంది. ఇలా వరుస చర్చల్లో భాగంగా ప్రభుత్వం లొంగిపోయిన వారికి కల్పించే ప్రయోజనాల గురించి వారికి తెలియజేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై భారతీయ వ్యవస్థలపై నమ్మకం ఏర్పడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఒక వేళ వారిపై ఉన్న రివార్డు ప్రకటించి ఉంటే లొంగిపోయిన తర్వాత ఆ మొత్తాన్ని వారికే అందించడం జరుగుతుందని చెబుతున్నారు. లొంగిపోయిన వారి కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల సాయం చేస్తుందని నచ్చజెప్పుతున్నారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఎలాంటి భయం లేకుండా పోలీసుల ముందు లొంగిపోలా చేస్తున్నారు. కాగా, గత ఐదేళ్లలో ఛత్రా ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ నిషేధించిన సంస్థలకు చెందిన 126 మంది అరెస్టు కావడం, వారే లొంగిపోవడం జరిగింది.

ఇవీ చదవండి:

J&K: ఉగ్రవాద ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

Scary Video: రాకాసి పిడుగు దెబ్బ.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు.. ఒళ్లుగగురుపొడిచే వీడియో.!

కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది