J&K: ఉగ్రవాద ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

Terrorist Associates: జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసి ఉగ్రవాదుల సహచరులను అదుపులోకి..

J&K: ఉగ్రవాద ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం
Seven Terrorist Associates Arrest
Follow us

|

Updated on: Mar 13, 2021 | 11:42 AM

Terrorist Associates: జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసి ఉగ్రవాదుల సహచరులను అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనఖీల్లో ఉగ్రవాదుల సహచరులు ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు హ్యాండ్ గ్రెనెడ్లు, మూడు ఏకే టైప్ మ్యాగజైన్లు, 105 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు ఉగ్రవాదుల సహచరులపై కాశ్మీర్ పోలీసులు ఇండియన్ ఆయుధ చట్టం 13,18,20,23,38, యూఎల్‌ఏ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని అరెస్టు చేయడం అతిపెద్ద విజయంగా పేర్కొన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో.. సమియుల్లా ఫరూఖ్ చోపాన్ (మీమెండర్ నివాసి), హిలాల్ అహ్మద్ వానీ (దాచిపొరా), రమీజ్ వాని (దాచిపొరా), రవుఫ్ అహ్మద్ వానీ (దాచిపొరా), జాహిద్ హుస్సేన్ వానీ (దాచిపొరా), ఫైజాన్ అహ్మద్ ఖాన్ (వెహిల్), షాహిద్ అహ్మద్ రాథార్ (వెహిల్) లను అరెస్టు చేసినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఈ ఏడుగురి అరెస్టు, భారీగా ఆయుధాల స్వాధీనంతో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వ్యవస్థ విచ్ఛిన్నం అయిందని.. ఉగ్రవాదులపై తాము సాధించిన గొప్ప విజయమని పోలీసులు వెల్లడించారు.

Also Read:

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..