భాగ్యనగర శివారులో దారుణం.. కత్తులతో దాడి చేసి రౌడీషీటర్ హత్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు.
Rowdy sheeter murder హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది.. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని ముస్తఫానగర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ జాబెర్ (22) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో అన్సారీ రోడ్ దానమ్మ జోపిడి ప్రాంతంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. అతనిపై విచక్షణా రహితంగా పొడిచి హతమార్చారు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జాబెర్‌ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటి తర్వాత మృతిచెందాడు. జాబెర్ గత జులైలో కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన షానూర్ ఘాజి హత్య కేసులో మూడో నిందితుడిగా ఉన్నాడు. అయితే, జాబెర్ హత్యకు పాత కక్షలే కారణమై ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాగా, ఈ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also… ఫేస్‌బుక్ పేరుతో వల.. నచ్చావ్ అంటూ నగ్న చిత్రాలు సేకరణ.. డబ్బుల కోసం వీడియోతో యువతి బ్లాక్‌మెయిల్