ఫేస్‌బుక్ పేరుతో వల.. నచ్చావ్ అంటూ నగ్న చిత్రాలు సేకరణ.. డబ్బుల కోసం వీడియోతో యువతి బ్లాక్‌మెయిల్
ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి కొంపముంచింది. పరిచయం పెంచుకున్న యువతి.. అతని నగ్న వీడియోలను పంపి బ్లాక్ మెయిల్‌కు పాల్పడింది.
Delhi girl blackmails : ఫేస్‌బుక్ పరిచయం ఓ యువకుడి కొంపముంచింది. పరిచయం పెంచుకున్న యువతి.. అతని నగ్న వీడియోలను పంపి బ్లాక్ మెయిల్‌కు పాల్పడింది. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలోని నలసోపారా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని టార్గెట్ చేసిన ఓ యువతి.. డబ్బులు కాజేసేందుకు ఫ్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఎంచుకుంది. ఓ రోజు రాత్రి 9 గంటలకు అతని మొబైల్‌కు మెసేజ్ పంపింది. అది తెరిచి చూస్తే.. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్. ఎవరో అందమైన అమ్మాయి ఆ రిక్వెస్ట్ పంపింది. వెంటనే ఓకే చేసేశాడు ఆ యువకుడు.
దీంతో ఇద్దరి మధ్య ముఖ పుస్తకంలో స్నేహం కుదిరింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య సరదా చాటింగ్ మొదలైంది. పరిచయాలు, పలకరింపులూ మొదలై… కొద్ది రోజుల్లోనే బాగా దగ్గరైపోయారు. ఎంతలా అంటే ఒకరినొకరు వాట్సాప్ నంబర్లు ఇచ్చుకునే దాకా.. ఇక, అమ్మాయి అడిగిందే అదునుగా, ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేశాడు ఆ యువకుడు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ మొదలైంది. మెల్లగా వీడియో చాట్ మొదలుపెట్టింది. ఫొటోల్లో కంటే… వీడియోలో ఇంకా అందంగా ఉందే అని సదరు యువకుడు కూడా సంబరపడిపోయాడు.
ఓ రోజు రాత్రి వేళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. నిద్రపోవడం మానేసి… ఆమెతో ముచ్చట్లు మునిగిపోయాడు. నువ్వు నాకు బాగా నచ్చావ్.. నీ బాడీ చూడాలని ఉంది.. అంటూ సరసం మొదలుపెట్టింది. దీంతో ఆయువకుడు బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కనిపించాడు. అన్నీ ఆమె చెప్పినట్లు చేశాడు. ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత… అతని వాట్సాప్ నంబర్‌కి… అతని నగ్న వీడియోని పంపింది. తనకు రూ.51 లక్షలు పంపాలని డిమాండ్ చేసింది. లేదంటే… ఆ వీడియోని అతని ఫ్రెండ్స్, పేరెంట్స్, బంధువులు, ఆఫీసులో ఉద్యోగులు అందరికీ పంపిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది. అందుకు యువకుడు నిరాకరించడంతో.. మార్చి 6 నుంచి 8 మధ్య బెదిరింపు కాల్స్‌కు పాల్పలడింది.
దీంతో షాక్ గరైన అతను వెంటనే తులింజ్ పోలీసులను ఆశ్రయించాడు. సదరు యువకుడి ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. సైబర్ సెల్ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ యువతి మొబైల్ నంబర్ స్విచ్ఛాఫ్ చేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే యువతిని అదుపులోకి తీసుకుంటామని తులింజ్ పోలీసులు తెలిపారు. తెలియని వ్యక్తులతో అడ్డమైన పరిచయాలూ పెంచుకోవద్దని పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి వాళ్లతోనైనా మీ ప్రైవసీ దెబ్బతినేలా ప్రవర్తించవద్దని కోరారు.
ఇదీ చదవండిః మద్యం మత్తులో పాముతో చెలగాటం ఆడిన ఒక యువకుడు …చివరికి ఏమైందంటే…!! ( వీడియో )