AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే

దీపావళికి ముందు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ 31, 2026న హైదరాబాద్‌, విజయవాడ, ఢిల్లీ, ముంబై నగరాల్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు ఎంత ఉన్నాయి? కిలో వెండి ధర ఎంత కొనసాగుతోంది? నగరాల వారీగా తాజా ధరలు తెలుసుకోండి.

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే
Gold Price
Shaik Madar Saheb
|

Updated on: Oct 31, 2026 | 6:39 AM

Share

బులియన్ మార్కెట్‌లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళికి ముందు బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గుతూ వస్తున్నాయి.. వాస్తవానికి బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి.. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణ.. ఇలా అంతర్జాతీయ పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.. తులంపై దాదాపు 1800ల వరకు ధర తగ్గింది. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ఆధారంగా శనివారం ( అక్టోబర్ 31) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ10 మేర తగ్గి.. రూ.1,42,250 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 10 తగ్గి.. రూ.1,30,390 గా ఉంది.

వెండి కిలో ధరపై రూ.100 మేర తగ్గి.. రూ.2,09,900 లుగా కొనసాగుతోంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో ధరలు..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,250, 22 క్యారెట్ల ధర రూ.1,30,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900 ఉంది.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,250 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,42,400, 22 క్యారెట్ల ధర రూ.1,30,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,42,250, 22 క్యారెట్ల ధర రూ.1,30,390 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,42,250, 22 క్యారెట్ల ధర రూ.1,30,390 ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900 ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,42,250, 22 క్యారెట్ల ధర రూ.1,30,390 ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us